CM Revanth Reddy : అర్హులందరికీ పెన్షన్లు ఇస్తాం.. 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
CM Revanth Reddy
CM Revanth Reddy : తెలంగాణలో అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలకు అవసరమైన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. ఐదేళ్లు మహిళకు మంత్రి పదవి ఇవ్వనివారు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
యువతకు నోటిఫికేషన్లు ఇచ్చి పేపర్లు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. మళ్లీ 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు.
Read Also : 10TV Global Footprints : తెలుగు గడ్డ నుంచి గ్లోబల్ ఎక్స్పోర్ట్స్.. చాంపియన్స్ కు 10టీవీ పట్టం
ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “వాడు వీడు వచ్చి మాయమాటలు చెప్పి మిమ్మల్ని తీసుకుపోతారు. అగ్గిపెట్టే రావు, అఘోరా రావు పెట్రోల్ బాటిల్ పట్టుకుని డ్రామాలాడాడు. 100 రూపాయల పెట్రోల్ తెచ్చి ఓ అగ్గిపెట్టి మర్చిపోయారా” అని ప్రశ్నించారు.
విద్యార్థులను రెచ్చగొట్టి, వారి శవాల పునాదులపై అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. “వాళ్లు మాయ లేడి, మాయగాల్లు.. వాళ్ల మాయలో పడకండి” అని ప్రజలకు సూచించారు. రొట్టె చేసే రాడ్డుతో వాళ్లకి వాత పెట్టాలని విమర్శించారు. మొత్తంగా పెన్షన్లు, ఉద్యోగాల భర్తీతో పాటు ప్రత్యర్థులపై తనదైన శైలిలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
