10TV Global Footprints : తెలుగు గడ్డ నుంచి గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్.. చాంపియన్స్ కు 10టీవీ పట్టం
10TV Global Footprints : వార్తా ప్రవాహంలో కొట్టుకుపోకుండా.. సమాచారాన్ని అన్ని కోణాల్లో క్షుణ్ణంగా విశ్లేషించి నిజానిజాల్ని నిగ్గు తేల్చే ప్రయత్నంలో 10టీవీ శైలి విభిన్నం. లోకల్ టు గ్లోబల్ సమాచారాన్ని క్షణాల్లో అందించడంలో 10టీవీ పంథా విలక్షణం
10TV Global Footprints Celebrates
10TV Global Footprints : 10 టీవీ.. ది అన్ బయాస్డ్ న్యూస్ ఛానల్. దశాబ్దానికి పైగా సుదీర్ఘ ప్రస్థానం 10టీవీది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసమస్యల్ని ఎలుగెత్తి చాటుతూ.. వేగం, కచ్చితత్వంతో వార్తల్ని ప్రసారం చేస్తూ.. సామాజిక బాధ్యతతో 10టీవీ తన విలక్షణతను చాటుకుంటోంది. వార్తా ప్రవాహంలో కొట్టుకుపోకుండా.. సమాచారాన్ని అన్ని కోణాల్లో క్షుణ్ణంగా విశ్లేషించి నిజానిజాల్ని నిగ్గు తేల్చే ప్రయత్నంలో 10టీవీ శైలి విభిన్నం.
లోకల్ టు గ్లోబల్ సమాచారాన్ని క్షణాల్లో అందించడంలో 10టీవీ పంథా విలక్షణం. ఎక్స్పర్ట్స్ అనాలసిస్, ఎక్స్‌క్లూజివ్ డ్రైవ్స్, గ్రౌండ్ రిపోర్ట్స్, 360 డిగ్రీస్ స్టోరీస్, స్పీడ్ న్యూస్, టాప్10 న్యూస్, పొలిటికల్ ఇన్సైడ్స్, సెటైరికల్ న్యూస్, స్పెషల్ ఫోకస్, వీకెండ్ రౌండప్స్, క్రైమ్ రౌండప్స్, బిజినెస్ ట్రెండ్స్, అగ్రికల్చర్ డెవలప్మెంట్స్, సోషల్ మీడియా ట్రెండింగ్స్, గ్లామర్ వరల్డ్ అప్డేటెడ్ న్యూస్.. ఇలాంటి ఎన్నో మైల్స్టోన్ కార్యక్రమాలు 10టీవీ బిగ్ స్ట్రెంత్.
రాజకీయ, సామాజిక, ఆర్థికం, వినోదం ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులతో చేసిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూస్, స్పెషల్ పాడ్ కాస్ట్ షోస్, ఫేస్ టు ఫేస్, చిట్ చాట్స్ ఎన్నో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ , మంత్రులు ( శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ), ఎంపీలు ( బండి సంజయ్, ఈటల, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందర్ రావు).. మాజీ మంత్రులు, విపక్ష నాయకులు ( కేటీఆర్, హరీశ్ రావు), పార్టీల అధ్యక్షులు (టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కవిత ).. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ( హైడ్రా రంగనాథ్, ఆకునూరి మురళి).. సామాజిక , ఆర్థిక వేత్తలు ( జయప్రకాశ్ నారాయణ్).., సెలబ్రిటీలు ( అనిల్ రావిపూడి, హేమ, ప్రగతి, సుమన్, బన్నీ వాస్) ఇలా అన్ని రంగాలకు చెందిన అతిరథ మహారథుల అంతరంగాన్ని ఆవిష్కరించే ఇంటర్వ్యూలతో 10 టీవీ సత్తా చాటుకుంటోంది.

10TV Global Footprints
ఏ పార్టీల అజెండాకో, ఏ ప్రభుత్వానికో మౌత్ పీస్‌లా కాకుండా.. సామాన్యుల పక్షాన నిలిచి గళమెత్తుతోంది. వైవిధ్యభరిత ప్రోగ్రామ్స్, అర్థవంతమైన స్క్రీన్ ప్రజెంటేషన్‌తో వీక్షకుల ఆదరణను రోజురోజుకూ పెంచుకుంటూ వందశాతం మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకుంటోంది 10టీవీ. తెలుగు రాష్ట్రాల్లో రీచ్ , టైమ్ స్పెంట్ రెండింటిలోనూ పోటీపడుతూ క్రమంగా గ్రాఫ్ పెంచుకుంటోంది. ప్రతి క్షణం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ..మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కాకుండా అటు డిజిటల్ ప్లాట్‌ఫాంలోనూ తగ్గేదేలే అనేలా దూకుడును కొనసాగిస్తోంది. క్రెడిబిలిటీ గ్రాఫ్‌లో రాజీపడకుండా అసలు సిసలు జర్నలిజానికి వీక్షకులు పట్టం కట్టేలా అన్‌స్టాపబుల్‌గా వెళ్తోంది 10టీవీ జర్నీ.
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న రోడ్డు ప్రమాదాలు, ఏలూరు జిల్లాలో క్యాన్సర్ భూతం, దేశాన్ని భయపెడుతున్న వైరస్ల కలకలం, రాయలసీమ జిల్లాల్లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మటన్ మాఫియా, హైదరాబాద్ నగరంలో డేంజరస్‌గా మారిన మ్యాన్ హోల్స్, కరెంటు తీగలు, ప్రాణాలు తీస్తున్న మాంజాలు, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్ల పరిస్థితి, ఏపీ – తమిళనాడు జాలర్ల జగడం, పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భండార్ రహస్యాలు, కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ప్రస్థానం, అమరావతిలో అభివృద్ధి పనులు , కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రౌండ్ రియాలిటీ, పోలవరం డే టు డే డెవలప్మెంట్స్, సాగు నుంచి ఉత్పత్తులు-మార్కెటింగ్ వరకు రైతులు పడుతున్న కష్టనష్టాలపై పాలకుల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసేలా సమగ్ర కథనాలు, టూ స్టేట్స్ రియల్ ఎస్టేట్ బూమ్, భాగ్యనగర బోనాల జాతర హడావుడి.. ఇలా తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని సునిశితంగా పరిశీలిస్తూ.. స్పెషల్ డ్రైవ్స్, కంప్లీట్ గ్రౌండ్ రిపోర్ట్‌లతో నిరంతరం సమాచారాన్ని క్షణాల వ్యవధిలో అందించే ప్రయత్నం చేస్తోంది 10టీవీ.
ఇక మెగా ఈవెంట్స్ రూపకల్పన, నిర్వహణలోనూ 10టీవీది అందెవేసిన చేయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, సాధించిన విజయాలు, అధిగమించాల్సిన మైలురాళ్లను ప్రజల ముందు ఆవిష్కరించే ప్రయత్నంగా.. మెగా కాంక్లేవ్స్, మారథాన్ డిబేట్స్, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు, యాంకర్ ప్రజెంటేషన్లలతో ప్రత్యేక కార్యక్రమాల్ని వీక్షకులకు అందిస్తోంది.
సమాజంలో విజయవంతమైన ప్రయాణాలతో ప్రేరణగా నిలిచినవారిని గుర్తించి, గౌరవించడంలోనూ 10టీవీ మార్గం విభిన్నం. తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో దిక్సూచిగా నిలిచిన అతిరథమహారథుల్ని సత్కరిస్తూ.. వారి విజయ ప్రస్థానానికి అక్షర పట్టాభిషేకం చేసింది 10టీవీ.
పలు రంగాల్లో సక్సెస్ ఐకాన్స్‌గా నిలిచిన ఎంట్రప్రెన్యూర్స్ విజయగాథల్ని ఎలుగెత్తి చాటుతూ నిర్వహించిన ”10TV Ace Achievers కాఫీ టేబుల్ బుక్ ” మెగా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. తిరుగులేని టేస్ట్, క్వాలిటీ, ఇన్నోవేషన్‌తో ఫుడ్ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ అవుట్‌లెట్స్‌ను ”ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్”తో సమున్నతంగా సత్కరించింది 10టీవీ .
విద్యారంగంలో అత్యున్నత సేవలకు పట్టం కడుతూ..మెరికల్లాంటి విద్యార్థుల్ని తీర్చిదిద్దిన కృషీవలురిని ”10TV Edu Visionary కాఫీ టేబుల్ బుక్ ” మెగా ఈవెంట్‌తో గౌరవించింది 10టీవీ. తెలంగాణలో నూతన సర్పంచ్‌లకు దిక్సూచిగా.. పల్లెల రూపురేఖల్ని మార్చే విజన్ డాక్యుమెంట్స్‌తో .. అతిరథ మహారథులైన ప్రజాప్రతినిధుల అనుభవాలను రంగరించిన వినూత్న మేధోమథన సదస్సు..”10TV గ్రామ స్వరాజ్యం-సర్పంచ్ల సమ్మేళనం..” ఓ మైలురాయి కార్యక్రమం. దేశ భద్రతకు రక్షణ కవచంలా నిలిచిన మన శాస్త్ర సాంకేతిక నిపుణుల మేథోమథన ఆయుధ యజ్ఞాన్ని కీర్తిస్తూ.. ”బియాండ్ది బోర్డర్స్.. సెక్యూరింగ్ ది వరల్డ్ ” కాఫీ టేబుల్ బుక్‌తో సగర్వంగా గౌరవించుకుంది.
డైనమిక్ జర్నలిజం, అన్ బయాస్డ్ న్యూస్, అల్టిమేట్ మెగా ఈవెంట్స్‌తో సాగుతున్న 10 టీవీ స్ఫూర్తిమంతమైన ప్రస్థానం .. ఇక ముందూ మరింత ఉత్సాహంతో కొనసాగుతుంది. నిరంతరం ప్రేక్షకాదరణను పెంచుకుంటూ సరికొత్త మైలురాళ్లను అధిగమించే ప్రయత్నంలో 10టీవీ అలుపెరుగని ప్రయాణం .. రెట్టించిన ఎనర్జీతో దూసుకెళ్తుంది.
