CM Revanth Reddy : ప్రజాదర్భార్‌లో సమస్య చెప్పుకునేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు.. స్వయంగా పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి తొలిసారి సీఎం హోదాలు ప్రజా భవన్ కు చేరుకున్నారు. సీఎంకు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజా సమస్యలను స్వీకరిస్తున్నారు.

CM Revanth Reddy First Praja Darbar 

CM Revanth Reddy First Praja Darbar  : రేవంత్ రెడ్డి తొలిసారి సీఎం హోదాలు ప్రజా భవన్ కు చేరుకున్నారు. సీఎంకు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజా సమస్యలను స్వీకరిస్తున్నారు. భూ తగాదాలు, భూ కబ్జాలతో పాటు పలు సమస్యల్ని చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీగా ప్రజా భవన్ కు తరలి వచ్చారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రజలు తనకు ఇచ్చిన సమస్యలను పరిశీలిస్తున్నారు. వారు ఇచ్చిన వినతిపత్రాలను పరిశీలిస్తున్నారు. దీంతో ప్రజలు సీఎంకు తమ బాధలు వెళ్లబోసుకుంటున్నారు.తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. ప్రజా భవన్ వద్ద ప్రజలు బారులు తీరి నిలబడ్డారు. ప్రజాభవన్ వద్ద పోలీసులు బందోబస్తు మధ్య ప్రజల సమస్యల్ని సీఎం పరిశీలిస్తునాన్నారు. అధికారులు ప్రజల ఆధార్ కార్డులను పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు.

కాగా..తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత ప్రగతి భవన్ ఇనుప సంకెళ్లు బద్దలు కొడతామని..ప్రగతి భవన్ ను ఇకనుంచి ప్రజా భవన్ గా మారుస్తామని..ప్రజా భవన్ కు ప్రజలు ఎవ్వరైనా రావచ్చని తమ సమస్యలు చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రజా దర్భార్ నిర్వహిస్తామని ప్రజలు అక్కడకు వచ్చి ప్రభుత్వానికి తమ సమస్యలు చెప్పుకోవచ్చని పిలుపునిచ్చారు. దీంతో మరునాడే ప్రజలు తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు.

ధరణి పోర్టల్ ఉద్యోగుల అక్రమాలు.. డిజిటల్ సంతకాలతో భారీగా భూముల బదలాయింపులు

ఒక్కొక్కరుగా ఇస్తున్న సమస్యలకు సంబంధించిన పత్రాలను సీఎం పరిశీలిస్తున్నారు. కాగా..దివ్యాంగులకు కూడా తమ సమస్యల్ని చెప్పుకునేందుకు ప్రజాభవన్ కు వచ్చారు. వారు లోపలికి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులు లోపలికి వెళ్లేందుకు ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా పోలీసులు స్వయంగా లోపలికి తీసుకెళుతున్నారు.

కాగా..తమ సమస్యలు చెప్పుకునేందుకు ఇక్కడి వచ్చామని..సీఎం స్వయంగా తమ సమస్యలు పరిశీలించటం నిజంగా ఆనందంగా ఉందని..ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే కాకుండా ప్రజా సమస్యలు తెలుసుకునే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుకు కూడా కొనసాగించాలని బాధితులు కోరుతున్నారు.

విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ సీరియస్, సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశం

 

ట్రెండింగ్ వార్తలు