CM Revanth Reddy : మీ భూమి 22ఏ జాబితాలో ఉందా..? సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. వారికి మాత్రం స్పష్టమైన హామీ
CM Revanth Reddy : ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.
- Harish Thanniru
- Updated on- August 19, 2026 / 07:36 AM IST
CM Revanth Reddy
- ప్రజలు తమ భూహక్కుల విషయంలో ఆందోళన చెందొద్దు
- ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ప్రైవేటు భూములకు సంబంధించి ఇబ్బంది రానివ్వం
CM Revanth Reddy : ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. 22ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
Also Read : Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గీత, చేనేత కార్మికులకు శుభవార్త.. వారికి నెలనెలా డబ్బులు..
రిజిస్ట్రేషన్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో పరిశీలించి, అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేషన్ వెంటనే చేయాలి.. జిల్లా కలెక్టర్లు 22ఏ జాబితా భూములను క్షుణ్ణంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందించాలని.. అందులో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రైవేటు భూములకు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 22ఏ భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, ఎటువంటి పుకార్లు, కట్టు కథలను విశ్వసించవద్దని సీఎం రేవంత్ ప్రజలకు సూచించారు.
