CM Revanth Reddy
CM Revanth Reddy Bhadrachalam Tour : సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రెండు దేవాలయాలను సందర్శించనున్నారు. తొలుత రేవంత్ రెడ్డి యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. అనంతరం ఆలయ నిర్వహణ, తదితర అంశాలపై దేవాలయంలో ఆలయ నిర్వాహకులు, అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తారు. అనంతరం యాదగిరి గుట్ట నుంచి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా బూర్గంపాడు మండలం సారపాకకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం వెళ్లి శ్రీసీతారామ చంద్ర స్వామివారి ఆలయ దర్శనం చేసుకొని, స్వామివారికి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రెండు ఆలయాలకు రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి వెళ్తుండటం గమనార్హం.
Also Read : CM Revanth : యాదాద్రీశుల వార్షిక బ్రహ్మోత్సవాలు.. సీఎం హోదాలో తొలిసారి యాదగిరిగుట్టకు రేవంత్ రెడ్డి
భద్రాచలంలో రాములోరి దర్శనం అనంతరం మార్కెట్ యార్డులో ఇందిరమ్మ ఇళ్ల పథకంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం మణుగూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సాయంత్రం జరిగే ప్రజా దీవెన సభకు సీఎం హాజరవుతారు. తొలిసారి సీఎం హోదాలో జిల్లాకు రేవంత్ వస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేశారు.
Also Read : CM Revanth Reddy : ఉచిత విద్యుత్, రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన