Commercial Taxes Department: తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ ఆల్ టైం రికార్డు.. ఏకంగా రూ.7,865 కోట్ల రాబడి

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోగతికి అద్దం పడుతూ వాణిజ్యపన్నుల శాఖ(Commercial Taxes Department) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఆదాయం నమోదైంది.

Telangana commercial taxes department records highest ever revenue in july

  • వాణిజ్యపన్నుల శాఖ రికార్డు వసూళ్లు
  • పందొమ్మిది శాతం వృద్ధి రేటు
  • దేశంలోనే రెండవ ప్రాధాన్య స్థానం

Commercial Taxes Department: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోగతికి అద్దం పడుతూ వాణిజ్యపన్నుల శాఖ (Commercial Taxes Department)చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఆదాయం నమోదైంది. గత జులై నెలలో జీఎస్టీ, వ్యాట్, ప్రొఫెషనల్ టాక్స్ రూపంలో ఏకంగా రూ.7,865 కోట్ల రాబడి వచ్చి రికార్డు సృష్టించింది. గతేడాది జులై నెలతో పోలిస్తే ఈసారి ఏకంగా 19 శాతం వృద్ధి రేటు నమోదు కావడం విశేషం. పన్ను వసూళ్లలో శాఖ చూపిన పటిష్టమైన పనితీరు, పారదర్శక విధానాలే ఈ చారిత్రాత్మక విజయానికి ప్రధాన కారణమని అధికారులు స్పష్టం చేశారు.

Operation Muskan: తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’.. 6,307 మంది చిన్నారులకు విముక్తి!

దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ:

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కేవలం జీఎస్టీ రూపంలోనే రూ.5,819 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. దేశవ్యాప్తంగా జులై నెలలో సగటు జీఎస్టీ వృద్ధి రేటు 10 శాతంగా ఉంటే, తెలంగాణ మాత్రం ఏకంగా 19 శాతంతో జాతీయ సగటును దాటేసి దూసుకుపోయింది. ఈ అద్భుతమైన వృద్ధి రేటుతో దేశంలోనే హరియాణా తర్వాత తెలంగాణ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య రంగాలు వేగంగా విస్తరిస్తుండటానికీ, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనడానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనం.