Telangana Congress First List
Telangana Congress First List : ఢిల్లీ వార్ రూమ్ లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కీ పాల్గొన్నారు. ఇప్పటికే 50శాతానికి పైగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయింది.
ఇవాళ జాబితాను ఖరారు చేసి ఏఐసీసీ ఎన్నికల కమిటీకి పంపించనుంది స్క్రీనింగ్ కమిటీ. మొదటి విడతలో దాదాపు 60 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
ఇక మంగళవారం లేదా బుధవారం ఏఐసీసీ ఎన్నికల కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది. 14వ తేదీలోపు అన్ని జాబితాలు సిద్ధం చేసే యోచనలో ఉంది కాంగ్రెస్. కొన్ని రోజులుగా సీట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఓబీసీ కమ్మనేతలు డిమాండ్ చేస్తున్నారు. కనీసం 35 సీట్లు ఇవ్వాలని అధిష్టానానికి ఓబీసీ నేతలు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన వాటికంటే ఎక్కువే ఇస్తామని, బీసీ కమ్మ నేతలకు కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారు. మరోవైపు అసెంబ్లీ టికెట్ కోసం కాంగ్రెస్ ఆశావహులు ఢిల్లీలోనే మకాం వేశారు.
Also Read : అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ తర్జనభర్జన.. టికెట్ల ప్రకటన ఎప్పుడు?
దాదాపు మూడు గంటలకు పైగా వార్ రూమ్ లో వాడీవేడిగా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా చర్చిస్తున్నారు. దాదాపు 60 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో చేసిన సర్వేల ఆధారంగానే గెలుపు గుర్రాలను నిర్ణయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ హైకమాండ్.. అభ్యర్థుల ఎంపికపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. స్క్రీనింగ్ కమిటీ విస్తృతంగా చర్చించాక ఈ అంశాలను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లనుంది.
Also Read : ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ వ్యాఖ్యల్లో నిజమెంత.. డబ్బు, మద్యం చేరాల్సిన చోటుకు చేరిపోయాయా?