MLC elections : ఖమ్మం, మెదక్ స్థానాల్లో పోటీ చేస్తాం : తెలంగాణ కాంగ్రెస్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ (Congress) పోటీ చేయనుంది. మెదక్, ఖమ్మం రెండు స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

Telangana Congress Decides To Contest In Mlc Elections

TPCC MLC elections : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ (Congress) పోటీ చేయనుంది. మెదక్, ఖమ్మం రెండు స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. బుధవారం (నవంబర్ 24) నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. మెదక్ నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల గౌడ్ బరిలోకి దిగనున్నారు.

కాంగ్రెస్ తరపున రాయల నాగేశ్వరరావు బరిలో నిలువనున్నారు. పార్టీ అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ వీరిద్దరి పేర్లను సూచిస్తూ పంపింది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్స్ రావాల్సి ఉంది. అది రాగానే బీ-పామ్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అందచేయనున్నారు. వచ్చే నెల డిసెంబర్ 10న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

మొత్తం 12 స్థానాలకు 10 చోట్ల పోటీ చేయాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. స్థానిక బలాబలాల మేరకు బీ ఫారంలు ఇవ్వనున్నట్లు పార్టీ తెలిపింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం జగ్గారెడ్డి భార్య నిర్మల గౌడ్ నామినేషన్ వేయనున్నారు. వరంగల్ లో ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన వేంవాసుదేవ రెడ్డికి మద్దతు ప్రకటించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, నిజామాబాద్ లలో మద్దతు కోరే ఇండిపెండెంట్‌లకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. త్వరలో పోటీ చేయనున్న అభ్యర్థులను టీపీసీసీ అధికారికంగా ప్రకటించనుంది.

Read Also : Petrol Rate : నేటి పెట్రోల్ ధర, ఏపీలో పెరిగిన ఇంధన ధరలు, తెలంగాణలో స్థిరం