Telangana Congress : అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు.. టికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు విధివిధానాలు ఖరారు

అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉంటుందని చెబుతూవచ్చారు. పీసీసీ చీఫ్ గా తన టికెట్ కూడా తన చేతిలో లేదని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.

Telangana Congress

Telangana Congress Candidates Selection : తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ముమ్మర ప్రణాళిక రచిస్తోంది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకమైన అడుగులు వేస్తోంది. ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. టికెట్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.

ఆగస్టు18 నుంచి 25 వరకు డీడీ రుసుం చెల్లించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సూచించింది. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి టికెట్ ఇవ్వడం కుదరదని స్క్రీనింగ్ కమిటీ తేల్చి చెప్పింది. సెప్టెంబర్ మొదటి వారంలో మరోసారి ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈసారి బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో ఎక్కడ ఎలాంటి పైరవీలకు తావు లేదని స్పష్టం చేసింది.

Telangana Politics: నేను ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ బాత్రూంలు కడుగుతుండే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉంటుందని చెబుతూవచ్చారు. పీసీసీ చీఫ్ గా తన టికెట్ కూడా తన చేతిలో లేదని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. పూర్తిగా సర్వేల్లో ముందున్న వారికే టికెట్ ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు దానికి భిన్నంగా కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు గాంధీ భవన్ కు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు దారుడి నుంచి కొంత రుసుం కూడా వసూలు చేయాలని కండీషన్ పెట్టారు. జనరల్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు రూ.2 లక్షలు, రిజర్వ్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు 1లక్ష రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయంపై కొంతమంది నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలుస్తోంది.

Serilingampally Constituency: శేరిలింగంపల్లిలో త్రిముఖ పోరు తప్పదా.. బరిలోకి టీడీపీ అభ్యర్థి?

దీంతో జనరల్ స్థానానికి రూ.50 వేలు, రిజర్వ్ స్థానానికి రూ.25 వేలు వసూలు చేయాలని భావించారు. ఇలా ఫీజు వసూలుపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దరఖాస్తు చేసే విధానం, ఫీజు వసూలు విధానానికి సంబంధించి పూర్తి నియమ నిబంధనలు రూపొందించేందుకు ఎన్నికల మేనేజింగ్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ్మకు అప్పగించారు.

డబ్బులు వసూలు చేయడానికే ఇలా దరఖాస్తులు చేయాలనుకోవడం కరెక్టు కాదని కొందరు నేతలు మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా మరోసారి సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. అదే నెలలో అభ్యర్థుల ప్రకటన ఉండబోతుందని తెలుస్తోంది. మొత్తంగా టికెట్ల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయితీ స్టార్ట్ అయింది.

ట్రెండింగ్ వార్తలు