Telangana New Minister : మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నది వీరే.. స్వయంగా ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎంగా భట్టి

రేవంత్ తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది ఎవరనే విషయంపై ఉత్కంఠ వీడింది. 11మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Telangana New Cabinet

Revanth Reddy : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది ఎవరనే విషయంపై ఉత్కంఠ వీడింది. 11మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి వారికి స్వయంగా ఫోన్లు చేసినట్లు సమాచారం. తెలంగాణ రాజ్ భవన్ కు మంత్రులు జాబితాను పంపించారు. మధ్యాహ్నం రేవంత్ తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Also Read : Revanth Reddy : అధికారిక కాన్వాయ్‌కు నో చెప్పిన రేవంత్ రెడ్డి.. చివరికి అధికారులు ఏం చేశారంటే?

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారిలో..
ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, దామోదర రాజనర్శింహ, జూపల్లి కృష్ణారావులు ఉన్నారు.

డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క..
ముందుగా అనుకున్నట్లుగానే డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తొలుత ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చేందుకు మొగ్గుచూపింది. ఈ క్రమంలో భట్టి విక్రమార్క, సీతక్క పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, గత రెండు రోజులుగా ఢిల్లీలో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్ర నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. మంత్రి వర్గం కూర్పు, డిప్యూటీ సీఎంల తదితర విషయాలపై చర్చించారు. ఈ క్రమంలో కేవలం ఒక్కరికి మాత్రమే డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు.

Also Read : Congress six guarantees : కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై అందరి చూపు

ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ..
ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, మంత్రులుగాతుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తుమ్మల నాగేశ్వరరావుకు క్యాబినెట్ లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ హయాంలలో మంత్రిగా పనిచేశారు. భట్టి విక్రమార్క గతంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నల్గొండ జిల్లాలో ముందుగా ఊహించినట్లుగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిద్దరికి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖలకు మంత్రులుగా అవకాశం దక్కింది. గతంలో కొండా సురేఖకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సీతక్క తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కరీనంగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం దక్కింది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మెదక్ జిల్లా నుంచి దామోదర్ రాజనర్సిహ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు మరికొద్ది సేపట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు