హోం మంత్రి ఇల్లు ముట్టడించిన కాంగ్రెస్ కార్యకర్తలు

  • Publish Date - October 8, 2020 / 12:19 PM IST

Telangana Congress Leaders : కాంగ్రెస్ కార్యకర్తలు మెరుపు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ ఇంటి గేట్లు తోసుకుని కాంగ్రెస్ నేతలు, ఇతర సంఘాల నేతలు వెళ్లారు. మెయిన్ గేట్ వద్దనున్న సెక్యూర్టీ గార్డ్స్ లు అడ్డుకున్నా..తోసుకుని వెళ్లిపోయారు. అనంతరం బైఠాయించి ధర్నా చేపట్టారు.



బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2020, అక్టోబర్ 08వ తేదీ గురువారం ఉదయం ఎలాంటి సమాచారం లేకుండా..వందలాది మంది కార్యకర్తలు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి క్వార్టర్స్ లోపలకు దూసుకెళ్లారు. అత్యాచారాలు, హత్యలు కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ..అంటూ నినాదాలు చేశారు.



తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నా కట్టడి చేయడం లేదని ఆరోపించారు. మెయినాబాద్, ఖమ్మంలో జరిగిన ఘటనలను ఉదహరిస్తున్నారు. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆందోళన చేపడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.