Telangana Cool Winds : తెలంగాణలో పెరిగిన చలిగాలులు…ప్రజలను వణికిస్తున్న చలి

మిగ్ జాం తుపాన్ ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు వీస్తుండటంతో జనం వణుకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని కుమురం భీమ్ జిల్లాలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 10.3 డిగ్రీల సెల్షియస్ కు పడిపోయింది.....

Telangana Cool Wind

Telangana Cool Winds : మిగ్ జాం తుపాన్ ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు వీస్తుండటంతో జనం వణుకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని కుమురం భీమ్ జిల్లాలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 10.3 డిగ్రీల సెల్షియస్ కు పడిపోయింది. సంగారెడ్డి జిల్లాలో 12.4 డిగ్రీల సెల్షియస్, రంగారెడ్డి జిల్లాలో 12.8 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 15.4 డిగ్రీల సెల్షియస్ కు ఉష్ణోగ్రత తగ్గింది.

పెరిగిన చలి తీవ్రత

రాత్రీ వీస్తున్న చలిగాలులతో ప్రజలు వణుకుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్కాజిగిరి, పటాన్ చెరువు, రామచంద్రాపురం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14.5 డిగ్రీల సెల్షియస్ గా నమోదైంది. హైదరాబాద్ నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు చలి తీవ్రతతో అల్లాడుతున్నారు. తెలంగాణలో వీస్తున్న చలిగాలులతో ఆస్తమా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అల్లాడుతున్న ఆస్తమా వ్యాధిగ్రస్థులు

ఆస్తమా వ్యాధిగ్రస్థులు చలి తీవ్రతతో శ్వాసనాళాలు సంకోచించడం వల్ల శ్లేష్మం పెరిగి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఈ చలిగాలుల బారిన పడకుండా ఆస్తమా వ్యాధిగ్రస్థులు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. చలిగాలుల ప్రభావం వల్ల చంటిపిల్లలు న్యుమోనియా వ్యాధి బారిన పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని నిలోఫర్ పిల్లల ఆసుపత్రిలో నిమోనియా కేసుల సంఖ్య పెరిగింది. విపరీతమైన చలి గాలుల వల్ల పిల్లలు జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో చికిత్స కోసం ఆసుపత్రులకు వస్తున్నారు.

ALSO READ : Crimes Against Women : దేశంలో మహిళలపై పెరిగిన నేరాలు…నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏం చెబుతుందంటే…

న్యుమోనియా సోకిన పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో తలుపులు, కిటికీలు మూసివేసి పిల్లలకు వెచ్చని వాతావరణం కల్పించాలని వైద్యులు సూచించారు. చలి తీవ్రతతో పలు చోట్ల ప్రజలు చలిమంటలు కాచుకుంటున్నారు. బయటకు వెళ్లాలంటే స్వెట్టర్లు ధరించి ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు