Cop saves man attempting to commit suicide:పోలీసులు ఓ యువకుడి ప్రాణాలను కాపాడారు. కుటుంబ కలహాలతో చనిపోవాలని నిర్ణయించుకున్న సురేష్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేయగా.. ఏడు నిమిషాల్లో కేసును ఛేదించిన పోలీసులు., ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఈ ఘటన చోటుచేసుకోగా.. పోలీసులు వ్యవహరించిన తీరు నిండు ప్రాణం కోల్పోకుండా ఉండడానికి కారణం అయ్యింది. చనిపోవాలని డిసైడ్ అయ్యాక.. ఉరితాడు ప్యాన్‌కు వేలాడింది. కొద్దిసేపట్లో చనిపోతాడు అనుకోగా.. అతని తల్లి, మిత్రులు చెన్నూరు పోలీసులను ఆశ్రయించారు.
సురేష్ రెడ్డి పంపిన మెసేజ్‌ని పోలీసులకు అందజేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు వీడియో ఆధారంగా ఉరేసుకోవాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. సిగ్నల్ ట్రేసింగ్ ద్వారా వెంటనే సంబంధిత ప్రాంతానికి పోలీసులు నిమిషాల్లో చేరుకొని బాధితుడి ప్రాణాలు కాపాడారు. ఇదంతా కేవలం ఏడు నిమిషాల్లో జరిగిపోవడంతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసుల తీరును కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఈ విషయాన్నిరామగుండం పోలీస్ కమిషనర్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు.
లాడ్జీలో ఉన్న అతన్ని పట్టుకుని క్షేమంగా తల్లికి అప్పగించారు. తన కుమారుడిని కాపాడిన పోలీసులకు సురేష్ రెడ్డి తల్లి కృతజ్ఞతలు తెలిపింది. తనకు కడుపుకోత మిగలకుండా పోలీసులు ఆదుకున్నారని అభినందించింది. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సురేష్ ఆచూకీ కనిపెట్టినట్లు చెన్నూర్ సీఐ ప్రమోద్ రావ్ తెలిపారు.