హైదరాబాద్‌లో ఉంటున్నారా..చేతిలో బండి ఉంది కాదా అని రోడ్డు పైకి రయ్ రయ్ మంటూ దూసుకువస్తున్నారా..ఏదో కారణం చెప్పి పోలీసుల నుంచి తప్పించుకోవొచ్చులే అనుకుంటున్నారా..అయితే ఇక నుంచి పోలీసుల ముందు మీ పప్పులేం ఉడకవ్. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. సిల్లీ రీజన్స్‌తో రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేసేస్తున్నారు. ఇకపై రోడ్డెక్కాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. సరైన కారణం చూపించకపోతే ప్రభుత్వ ఉద్యోగులను సైతం విడిచిపెట్టమంటున్నారు పోలీసులు.
లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నా నగరవాసులు రోడ్లపైకి వస్తునే ఉన్నారు. ఏదో ఒక సిల్లీ రీజన్ చెప్పి తప్పించుకుంటున్నారు. పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తూ రోడ్ల మీదకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా వినిపించుకోవడం లేదు. వాహనాలు సీజ్ చేస్తున్నా కాస్త కూడా భయం లేకుండా పోయింది. దీంతో పోలీసులు ఓ అడుగు ముందుకేసి నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేస్తూ సీజ్ చేయడమే కాదు…రోడ్లపై అకారణంగా తిరుతున్నవారిపై కేసులు పెడుతున్నారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 400లకు వాహలను సీజ్ చేశారు పోలీసులు.
ఇకపై ఎమర్జెన్సీ సర్వీసుల కోసం బయటకు వస్తున్నవారిని మినహాయించి..మిగతా వారు తప్పనిసరిగా రెసిడెన్షియల్ ప్రూఫ్ చూపించాలి. లేదంటే కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగులకు రోజువారీగా కలర్ పాసులను మంజూరు చేయాలని ఆదేశించారు డీజీపీ మహేందర్‌రెడ్డి. సోమవారం ఎరుపు రంగు పాస్, మంగళవారం గ్రీన్ కలర్ పాస్, బుధవారం పసుపు రంగు పాసు,గురువారం తెలుపు రంగు పాసులు, శుక్రవారం లేత గులాబీ కలర్ పాసు,శనివారం నీలి రంగు పాసులు మంజూరు చేయాలని సంబంధిత ప్రభుత్వ విభాగాలకు సూచించారు. అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు కచ్చితంగా పాసులను చూపించాలని లేనియెడల వారి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు పోలీసులు.
హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నా..జనం రోడ్లపైకి వస్తుండటంతో పోలీసులు మార్గదర్శకాలను మార్చే పనిలో పడ్డారు. ఇకపై రోడ్డెక్కాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. సరైన కారణం చూపించకపోతే ప్రభుత్వ ఉద్యోగులను సైతం విడిచిపెట్టమన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్.