TS Covid-19 Updates : తెలంగాణలో కొత్తగా 2,384 కరోనా పాజిటివ్.. 17 మరణాలు

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Ts Covid 19 Updates

TS Covid-19 Updates : తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అలాగే పదుల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా కొవిడ్ పాజిటివ్ కేసులు 2,384 నమోదయ్యాయి.

17 మంది కరోనాతో మృతిచెందారు. కొత్త కరోనా కేసులతో కలిపి మొత్తంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య 5,80,844గా ఉంది. అయితే, ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 3296 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కొత్తగా 2242 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

కరోనాతో మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 5,46,536గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా 94,189 శాంపిళ్లను పరిక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక జీహెచ్‌ఎంసీలో 307 కేసులు, మేడ్చల్‌లో 116, నల్గొండలో 170, రంగారెడ్డి 135, ఖమ్మంలో 167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.