Telangana Vaccination: తెలంగాణలో వ్యాక్సినేషన్‌ బంద్..!

తెలంగాణలో వ్యాక్సినేషన్‌కు మరోసారి బ్రెక్‌ పడింది. కొవిషీల్డ్‌ తొలి, రెండో డోస్‌ మధ్య వ్యవధిలో కేంద్రం ప్రభుత్వం మార్పులు చేయడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Covid Vaccination Bandh : తెలంగాణలో వ్యాక్సినేషన్‌కు మరోసారి బ్రెక్‌ పడింది. కొవిషీల్డ్‌ తొలి, రెండో డోస్‌ మధ్య వ్యవధిలో కేంద్రం ప్రభుత్వం మార్పులు చేయడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కొవిడ్ వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ని ఇవాళ, రేపు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఎల్లుండి నుంచి 45ఏళ్లు దాటిన వారికి యధాతథంగా వ్యాక్సినేషన్‌ జరుగుతుంది. కొవిషీల్డ్ టీకా మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు 12 నుంచి 16 వారాల వ్యవధిలో ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

డోసుల గ్యాప్‌ మార్పుతో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌ని రద్దు చేసింది. దీంతో కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారికి మొదటి డోస్ తర్వాత 12 వారాలు దాటకే రెండో డోస్ ఇవ్వనున్నట్లు కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. ఇప్పటివరకు కొవిషీల్డ్‌ టీకా రెండో డోస్‌ను 6 నుంచి 8 వారాల తర్వాత ఇచ్చారు.

ఇక తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 4 వేల 305 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఎక్కువగా గ్రేటర్‌ పరధిలోనే కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 6 వేల 361 మంది కోలుకోగా, 29 మంది మరణించారు. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 54 వేల 832గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు