Bhatti Vikramarka : వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టం.. స్పష్టం చేసిన భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
- Harish Thanniru
- Published on- September 11, 2026 / 02:32 PM IST
Deputy CM Bhatti Vikramarka
Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలిలో జరిగిన చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నకు భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. అగ్రికల్చర్ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేయడం లేదని తేల్చి చెప్పారు. అయితే, స్మార్ట్ మీటర్ల అంశంపై గత ప్రభుత్వ హయాంలోనే కేంద్రంతో ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. ఆర్డిఎస్ఎస్ పథకం కంటే ముందే ‘ఉదయ్’ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు.
Also Read : Telangana Govt : బీసీ మహిళలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఈనెల 15వ తేదీ వరకే చాన్స్..
2017లోనే రాష్ట్రంలోని వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రభుత్వం ఒప్పందంపై సంతకం చేసిందని భట్టి వివరించారు. ఉదయ్ పథకంలో తెలంగాణ చేరుతున్నట్లు అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ మిశ్రా సంతకం చేశారని తెలిపారు. అదేవిధంగా అప్పటి టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు కూడా సంబంధిత ఒప్పందాలపై సంతకాలు చేశారని భట్టి విక్రమార్క వెల్లడించారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ విషయంలో తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయబోమని డిప్యూటీ సీఎం మరోసారి స్పష్టం చేశారు.
