Telangana Rains : తెలంగాణలో వేగంగా మారుతున్న వాతావరణం.. ఈ రెండు రోజులు అప్రమత్తం.. భారీ వర్షాలకు ఛాన్స్!
Telangana Rains : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. వర్షాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలకు, ముఖ్యంగా రైతులకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది.
Telangana Rains
Telangana Rains : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. వర్షాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలకు, ముఖ్యంగా రైతులకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నేటి నుంచి 14వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also Read : Donald Trump : వార్నీ.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఫాలో అవుతున్న ట్రంప్..?
దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతోంది. ఇది క్రమంగా బలహీనపడి విదర్భ ప్రాంతంలో బలహీన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వ్యవస్థ ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేటి నుంచి 14వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఉండొచ్చని, ముఖ్యంగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది.
ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. 50 నుంచి 70 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అంచనా. హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఈ రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 12న వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అల్పపీడనం ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సెప్టెంబర్ 15 నుంచి 17 మధ్య వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అయితే వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులను బట్టి తాజా అంచనాల్లో మార్పులు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో రానున్న రెండు, మూడు రోజుల్లో వాతావరణ శాఖ జారీ చేసే తాజా హెచ్చరికలను ప్రజలు గమనించాలని సూచిస్తున్నారు. మరోవైపు.. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో వేచి ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
