Bigg Boss 10 Telugu Day 4 Full Episode : బిగ్ బాస్ చరిత్రలోనే షాక్.. నాలుగో రోజే ఎలిమినేషన్.. పాపం రోహిత్ అతన్ని బలిపశువుని చేసి.. బిగ్ బాస్ 10 ‘డే 4’ ఫుల్ ఎపిసోడ్..
Bigg Boss 10 Telugu Day 4 Full Episode : మొదటి ఎలిమినేషన్ లో భాగంగా చరణ్, రామ్ ప్రసాద్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని బిగ్ బాస్ చెప్పాడు.
Bigg Boss 10 Telugu Day 4 Full Episode
Bigg Boss 10 Telugu Day 4 Full Episode : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేడు నాలుగో రోజు జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో హై రిస్క్ లో పెట్టడం, పనులు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం సాగింది. నేడు దేబ్జానీ టీమ్ నుంచి ముకేశ్, త్రిగున్.. రోహిత్ టీమ్ నుంచి రోహిత్, వంశీ లను బిగ్ బాస్ పిలిచి మీరు హౌస్ మేట్స్ అవ్వాలంటే మీ సొంత టీమ్ లోనే ఒకర్ని హై రిస్క్ లో పెట్టమన్నారు బిగ్ బాస్. దాంతో త్రిగున్,ముకేశ్ తమ టీమ్ లో కృష్ణుడిని హై రిస్క్ లో పెట్టారు. తర్వాత రోహిత్, వంశీ తమ టీమ్ లో చైత్ర రాయ్ ని హై రిస్క్ లో పెట్టారు. ఇక ఎప్పట్లాగే రోహిత్ తన అగ్నిపరీక్ష బ్యాచ్ ని కాపాడుకొని చైత్ర రాయ్ ని పెట్టారు రిస్క్ లో.
అనంతరం రోహిత్, వంశీ, త్రిగున్,ముకేశ్ లకు ఒక గేమ్ పెట్టారు. ఇందులో రోహిత్, వంశీ గెలవడంతో హౌస్ మేట్స్ గా అర్హత సాధించారు. చైత్ర హై రిస్క్ లోకి వెళ్ళింది. అయితే రోహిత్, అతని అగ్నిపరీక్ష బ్యాచ్ తమ టీమ్ చైత్ర హై రిస్క్ లో పెట్టి మ్యూజిక్, డ్యాన్స్ అంటూ హడావిడి చేసారు. దీంతో సొంత టీమ్ వెన్నుపాటు పొడిచారని చైత్ర ఏడ్చింది. దాంతో షాలిని – చైత్ర మధ్య గొడవ అయింది. షాలిని గొడవ పెట్టుకోడానికి వచ్చి షాలినినే ఏడ్చి సింపతీ బాగా ట్రై చేసింది. దీంతో రోహిత్ చైత్ర ని కూల్ చేయడానికి ట్రై చేసాడు.
Also Read : Epic Review: ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ రివ్యూ.. ‘బేబీ’ జంట ఆనంద్ – వైష్ణవి కొత్త సినిమా ఎలా ఉందంటే..?
అనంతరం ఎప్పట్లాగే రోహిత్ కిచెన్ లోకి వెళ్లి నాకు ఇష్టం వచ్చినప్పుడు తింటాను అని ఎగ్స్ రెండు టీమ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని బ్లూ టీమ్ లో గొడవ పెట్టాడు. ఎప్పట్లాగే తన వాషింగ్ పని ఎగ్గొట్టడానికి ట్రై చేసాడు.
అనంతరం హై రిస్క్ లో ఉన్న చైత్ర, చరణ్, రామ్ ప్రసాద్ ముగ్గుర్ని పిలిచి మీలో మీరు ఒకరు ఈ వారం నుంచి ఎలిమినేషన్ తప్పించుకునే ఛాన్స్ సెలెక్ట్ చేసుకోమ్మన్నాడు బిగ్ బాస్. రామ్ ప్రసాద్, చరణ్ ఇద్దరూ చైత్ర ని ఎలిమిలేషన్ నుంచి సేవ్ చేసారు. అయితే అగ్నిపరీక్ష టీమ్ చరణ్ ని ఎందుకు ఆమెకు ఛాన్స్ ఇచ్చావు అని ఇన్ఫ్ల్యూఎన్స్ చేయడానికి ప్రయత్నించారు.
Also Read : Mandaadi Review: ‘మండాడి’ మూవీ రివ్యూ.. సుహాస్ విలన్ గా నటించిన సినిమా.. సముద్రంపై పోటీ అదిరిందిగా..
మొదటి ఎలిమినేషన్ లో భాగంగా చరణ్, రామ్ ప్రసాద్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని బిగ్ బాస్ చెప్పాడు. వాళ్ళిద్దర్నీ నిల్చోమని కంటెస్టెంట్స్ ని ఎవరు ఎలిమినేట్ అవ్వాలో వారి ముఖానికి రంగు పూసి కారణం చెప్పమన్నారు. ఎవరికి ఎక్కువమంది రంగు పూస్తారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అని చెప్పాడు. దీంతో చరణ్ కి త్రిగున్, కృష్ణుడు, సుధీర్, వర్షిణి, వంశీ, ముకేశ్, దేబ్జానీ, నరేష్, ఝాన్సీ లు రంగు పూశారు. రామ్ ప్రసాద్ కి సృష్టి, షాలిని, అమన్, రోహిత్ లు రంగు పూశారు. చైత్ర హై రిస్క్ లో ఉండి కాబట్టి రంగు పూసే ఛాన్స్ బిగ్ బాస్ ఆమెకు ఇవ్వలేదు. ఎక్కువ ఓట్లు చరణ్ కి పడటంతో అనూహ్యంగా మొదటి వారం మధ్యలో నాలుగో రోజే చరణ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో చరణ్ ఏడ్చాడు.
అయితే అందరూ చెప్పిన కారణం ఒకటే. చరణ్ ఇండివిడ్యుయల్ గేమ్ ఆడట్లేదు. రోహిత్ నీడలో ఉన్నాడు, అగ్నిపరీక్ష బ్యాచ్ అని గ్రూప్ చేసుకొని ఆడుతున్నారు అని చెప్పారు. అందరూ కారణం చెప్పారు అదే నిజం కాబట్టి. అయితే రోహిత్ తాను తప్పించుకొని చరణ్ ని బలిపశువు ని చేసి గత ఎపిసోడ్ లో హై రిస్క్ లో చరణ్ ని పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా రోహిత్.. రామ్ ప్రసాద్ ని నామినేట్ చేసినా చరణ్ సరిగ్గా ఆడట్లేదు అనే చెప్పడం గమనార్హం. చరణ్ ఆడలేదు కానీ తర్వాత ఆడతాడు, అతనికి టైం కావాలి అని చెప్పడం గమనార్హం. దీంతో రోహిత్ తన అగ్నిపరీక్ష బ్యాచ్ ని అడ్డం పెట్టుకొని ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నాడో అర్ధమవుతుంది. మరి రోహిత్ కింద ఉన్న అగ్నిపరీక్ష బ్యాచ్ కి ఇది అర్ధం అవుతుందో లేదో చూడాలి.
