కుండపోత వాన..కుదేలైన బతుకులు : యూరియా తిని 22,ఇల్లు కూలి 12 మేకలు మృతి

  • Publish Date - October 14, 2020 / 11:23 AM IST

Telangana : కుండపోత కురిసిన వాన పలువురి పొట్టకొట్టింది. బతుకుల్ని కుదేలు చేసేసింది. పంటల్ని నాశనం చేసింది. సోమవారం (అక్టోబర్ 13,2020) ఉదయం నుంచి రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అల్లాడిపోయింది. ముఖ్యంగా తల్లాడ మండల కేంద్రంలో ఓ పాత పెంకిటిల్లు వరపు నీటిని పూర్తిగా నానిపోయి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మేకలు చనిపోయాయి.


దీంతో ఆ మేకలమీద ఆధారపడి జీవిస్తున్న యజమాని తల్లడిల్లిపోయాడు. జరిగిన నష్టాన్ని తలచుకుని తల బాదుకుని రోదిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్‌ మండలంలోని పురాణీపేట్‌లో పొటాష్‌, యూరియా తిని 22 మేకలు మృతిచెందాయి. దీంతో మృత్యువాత పడిన మేకల సంఖ్య 37కు చేరింది.


మెండి శారదకు చెందిన మేకల మంద లింబాద్రి గుట్ట పరిసర ప్రాంతాల్లోకి మేతకు వెళ్లింది. అక్కడ ఉన్న పంట పొలాల వద్ద వాడి పడేసిన పొటాష్‌, యూరియాను మేకలు తిన్నాయి. తరువాత మేకలు చనిపోయారు. వాటినిచూసిన శారద కొడుకు అరవింత్ తల్లికి చెప్పాడు.


వెంటనే వాటిని శారత భీమ్‌గల్‌ పశు వైద్యశాలకు సమాచారం అందించటంతో సిబ్బంది అక్కడికి వచ్చి వాటికి ప్రథమ చికిత్స అందించగా.. మూడు మేకలు ప్రాణపాయ స్థితి నుంచి బయటపడగా మిగితా 22 మేకలు చనిపోయాయి. దీంతో తనకు రూ.2లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు లబోదిబోమంటూ రోదిస్తోంది.