Telangana : అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన విద్యాశాఖ

తెలంగాణ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్ 23తో అకడమిక్ ఇయర్ ముగుస్తోంది.

Telangana : సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో ప్రత్యేక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలతో విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. 2021-22 అకడమిక్ ఇయర్ 2022 ఏప్రిల్ 23తో ముగుస్తుందని తెలిపారు. అన్ని తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 23వరకు పరీక్షలు పూర్తవుతాయని తెలిపారు. వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వ తేదీ వరకు ఉండనున్నాయి.

ఇక జనవరి 10వ తేదీ వరకు పదవతరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 28 తేదీలోపు ఫ్రీ ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది. 1 నుంచి 9 తరగతి వరకు ఫిబ్రవరి 28లోపు సిలబస్ పూర్తి చేస్తామని వివరించింది విద్యాశాఖ. దసరా సెలవులు 12 రోజులు (అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 17వరకు) క్రిస్మస్ సెలవులు ఆరు రోజులు (డిసెంబర్ 22 నుంచి 28 వరకు) “మిషనరీ పాఠశాలలకు మాత్రమే క్రిస్మస్ సెలవులు”. ఇక సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 16 వరకు ఇవ్వనున్నారు.

ట్రెండింగ్ వార్తలు