Telangana Election 2023 : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్.. గతంకంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదు ?

భద్రాచలం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గతంకంటే ఈసారి ఎక్కువగా నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Telangana Election 2023

Telangana Assembly Election 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగియనుంది. అయితే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే పోలింగ్ ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలతో పాటు.. సిర్పూరు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4గంటలకే ముసిగింది. 4గంటల వరకు పోలింగ్ స్టేషన్ లో క్యూలైన్ లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు.

Also Read : Revanth Reddy : కామారెడ్డిలో హైటెన్షన్.. రేవంత్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు

గతంకంటే ఎక్కువ పోలింగ్ నమోదవుతుందా? 
భద్రాచలం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గతంకంటే ఈసారి ఎక్కువగా నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ..
2018 ఎన్నికల సమయంలో 82.46శాతం పోలింగ్ నమోదైంది. పినపాక నియోజకవర్గంలో 81.95శాతం, ఇల్లందు నియోజకవర్గంలో 83.49 శాతం, కొత్తగూడెం నియోజకవర్గంలో 81.75 శాతం, అశ్వారావుపేట నియోజకవర్గంలో 88.06 శాతం, భద్రాచలం నియోజకవర్గం 80.41శాతం పోలింగ్ నమోదైంది.

Also Read : Achampet : అచ్చంపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ

2023 అసెంబ్లీ ఎన్నికల్లో..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐడు నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకు 70శాతం కంటే తక్కువగానే పోలింగ్ నమోదైంది.
పినపాక నియోజకవర్గంలో 71శాతం, ఇల్లందు నియోజకవర్గంలో 68శాతం, కొత్తగూడెం నియోజకవర్గంలో 80శాతం, అశ్వారావుపేట నియోజకవర్గంలో 72శాతం, భద్రాచలం నియోజకవర్గంలో 73శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ బూత్ లో ఉన్న ఓటర్లు ఓటువేస్తే గతం కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు