Telangana : ప్రభుత్వంపై బీజేపీ పగపట్టింది.. మంత్రులనే అవమానిస్తారా..?

పని లేక ఢిల్లీ వచ్చారని వ్యాఖ్యానించి...తెలంగాణ రైతాంగాన్ని కేంద్రమంత్రి అవమానించారని తెలిపారు. మంత్రుల బృందాన్ని అవమాన పరిచారు..అవహేళన చేశారని తెలిపారు.

Piyush Goyal

Telangana Finance Minister : తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతోంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మంత్రులు తప్పుబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై  కేంద్రంలోని బీజేపీ సర్కారు పగబట్టిందని ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు. వడ్లు కొనమని అంటే.. తాము కొనబోమని చెబుతోందని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అందరి తరుపున ఢిల్లీకి వెళ్ళి వడ్లు కొనాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ని అడిగారన్నారు. అయితే.. పని లేక ఢిల్లీ వచ్చారని వ్యాఖ్యానించి.. తెలంగాణ రైతాంగాన్ని కేంద్ర మంత్రి అవమానించారని తెలిపారు. మంత్రుల బృందాన్ని అవమాన పరిచారనీ.. అవహేళన చేశారని అన్నారు.

Read More : Bill Gates: మూడు నెలల్లో ప్రమాదంలో ప్రపంచం.. బిల్‌గేట్స్ సంచలనం!

ఓట్లు వేసి గెలిపించిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. వడ్లు కొనాలంటూ కేంద్రాన్ని అడగడం లేదని.. వారికి గుణపాఠం చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. బుధవారం(2021 డిసెంబర్ 22వ తేదీ) జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు.. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు.. రైతులకు 24 గంటల విద్యుత్, సాగు నీరు, ఎరువులు, విత్తనాలు, రైతు బంధు, రైతు బీమా పథకాలను కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందనే విషయాన్ని గుర్తు చేశారు.

Read More : School Students Test Covid Positive : ఒకే స్కూల్ లోని 29మంది విద్యార్థులకు కరోనా

ఢిల్లీ బీజేపీ నాయకులు రైతులకు ఏం ఇచ్చారని ప్రశ్నించారు హరీష్ రావు. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా వడ్లు కొన్నారని గుర్తుచేశారు. ఆత్మగౌరవం దెబ్బ తింటే ఎందాకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మల్దకల్ స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి అశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా.. మల్తకల్ మండల కేంద్రంలో పీహెచ్ సీ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఎద్దులు బండి లాగుడు పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీ లు కశిరెడ్డి నారాయణరెడ్డి, సురభి వాణి దేవి, కలెక్టర్ క్రాంతి, జెడ్పీ చైర్ పర్సన్ సరిత, ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, తదితరులు పాల్గొన్నారు.