Telangana Floods
Telangana Floods: తెలంగాణలో భారీ వర్షాల ధాటికి పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. ఇప్పటివరకు 1,200 మందిని కాపాడామని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు.
వర్షాలు, వరదలపై జితేందర్ ఇవాళ 10టీవీతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ ఫోర్స్ అప్రమత్తంగా ఉందని తెలిపారు. (
Telangana Floods)
కామారెడ్డి, రామయంపేట్, నిర్మల్, మెదక్ జిల్లాలో వరద ఉధృతి తగ్గిందని తెలిపారు. పోలీసులు 24 గంటలు రెస్క్యూ టీమ్ తో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నామని అన్నారు. కామారెడ్డిలో వరదలు తగ్గాయని, రెస్క్యూ చేస్తూనే ఉన్నామని తెలిపారు.
కాగా, భారీ వర్షాలకు కామారెడ్డిలోని పలు కాలనీలు మునిగిపోయాయి. పంటలు నీటమునిగాయి. ఈ పరిస్థితిలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కళాశాలలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.
కామారెడ్డిలో కైసంపల్లి వద్ద భారీ వర్షాలు జాతీయ రహదారి 44కు తీవ్ర నష్టం కలిగించాయి. దీంతో ఉత్తర-దక్షిణ కారిడార్ దెబ్బతింది. ట్రాఫిక్ నిలిచిపోయింది. రవాణా వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. అధికారులు తాత్కాలిక మరమ్మతు పనులు ప్రారంభించారు.
అంతేకాకుండా నాగిరెడ్డి మండలంలోని పోచారం ప్రాజెక్టుకు బుధవారం 1.50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రావడంతో ఆందోళన నెలకొంది. ఇన్‌ఫ్లో కొంచెం తగ్గినా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు.