అందుకే మేము దీని గురించి బీజేపీని అడుగుతున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్
బీసీ రిజర్వేషన్ల అంశంలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మద్దతు తెలపాలని చెప్పారు. అలాగే, కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్ పై వస్తున్న ఆరోపణలు ప్రూవ్ చేసుకోవాలని సవాలు విసిరారు.

Minister Ponnam Prabhakar
Ponnam Prabhakar: బీసీ రిజర్వేషన్ల అంశంపై 10టీవీతో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు వివరాలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో సానుకూలంగా ఉన్న బీజేపీ.. కేంద్రంలో మాత్రం అడ్డుకుంటోందని చెప్పారు.
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది కాబట్టి తాము ఆ పార్టీ నేతలను అడుగుతున్నామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన రాష్ట్ర మంత్రుల కమిటీ న్యాయకోవిదులతో చర్చించి ముందుకెళుతోందని తెలిపారు.
Also Read: కన్యాదానం వేళ కూతురికి బంగారం కాదు.. కత్తి, తుపాకీ ఇవ్వండి: మహాపంచాయత్ పిలుపు
కమిటీ అనేక అంశాలపై చర్చించిన తర్వాత బలహీన వర్గాలకు న్యాయం చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు అనేది ఊహాగానాలు మాత్రమేనని చెప్పారు. ఈ సారి అసెంబ్లీకి కేసీఆర్ రావాలని కోరుతున్నానని అన్నారు.
బీసీ రిజర్వేషన్ల అంశంలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మద్దతు తెలపాలని చెప్పారు. అలాగే, కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్ పై వస్తున్న ఆరోపణలు ప్రూవ్ చేసుకోవాలని సవాలు విసిరారు. (Ponnam Prabhakar)
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అనుసరించాల్సిన విధానంపై ఢిల్లీలో న్యాయ కోవిదులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించిన విషయం తెలిసిందే. న్యాయ వివాదాలు లేకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అనుకుంటున్నారు.