ఇండియాపై 50 శాతం టారిఫ్‌లు విధించిన అమెరికాను భారత్‌ ఎలా గందరగోళంలో పడేయొచ్చో చెప్పిన రామ్‌దేవ్‌ బాబా

"ఇలా చేస్తే ట్రంప్ స్వయంగా ఈ టారిఫ్‌లను వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ట్రంప్ ఒక పెద్ద తప్పు చేశారు” అని రాందేవ్ అన్నారు.

ఇండియాపై 50 శాతం టారిఫ్‌లు విధించిన అమెరికాను భారత్‌ ఎలా గందరగోళంలో పడేయొచ్చో చెప్పిన రామ్‌దేవ్‌ బాబా

US tariffs on India

Updated On : August 28, 2025 / 2:45 PM IST

US tariffs on India: ఇండియాపై 50 శాతం టారిఫ్‌లు విధించిన అమెరికాను భారత్‌ ఎలా గందరగోళంలో పడేయొచ్చో చెప్పారు యోగా గురు రామ్‌దేవ్‌ బాబా. అమెరికన్ ఉత్పత్తులను బహిష్కరించాలని భారతీయులను కోరారు.

ఇండియాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన 50 శాతం టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అమెరికా చర్యను “బుల్లీంగ్, హూలిగనిజం, డిక్టేటర్షిప్”గా రామ్‌దేవ్‌ బాబా అభివర్ణించారు.

ఇండియన్లు పెప్సీ, కోకాకోలా, కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్‌ వంటి అమెరికన్ కంపెనీలకు భారతీయులు వెళ్లడం ఆపేస్తే అమెరికా గందరగోళంలో పడుతుందని ఆయన అన్నారు. అన్ని అమెరికన్ ఉత్పత్తులను బహిష్కరిస్తే ట్రంప్ టారిఫ్‌లను వెనక్కి తీసుకోవాల్సి వస్తుందని సూచించారు. అమెరికన్ కంపెనీలు, బ్రాండ్లను పూర్తిగా బహిష్కరించాలని చెప్పారు.

“అమెరికా ఇండియాపై విధించిన 50 శాతం టారిఫ్‌లను భారత పౌరులు రాజకీయ బుల్లీంగ్, హూలిగనిజం, డిక్టేటర్షిప్‌గా తీవ్రంగా వ్యతిరేకించాలి. అమెరికన్ కంపెనీలు, బ్రాండ్లు పూర్తిగా బహిష్కరించాలి” అని రామ్‌దేవ్ మీడియాతో అన్నారు.

భారతీయులు పెప్సీ, కోకాకోలా, సబ్‌వే, మెక్‌డొనాల్డ్స్‌, కేఎఫ్‌సీ వంటి అమెరికన్ కంపెనీల కౌంటర్ల వద్ద కనిపించకూడదని చెప్పారు. (US tariffs on India)

“ఒక్క ఇండియన్‌ కూడా పెప్సీ, కోకాకోలా, సబ్‌వే, కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్‌ కౌంటర్ల వద్ద కనిపించకూడదు. ఇది జరిగితే అమెరికాలో గందరగోళం ఏర్పడుతుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది.

ట్రంప్ స్వయంగా ఈ టారిఫ్‌లను వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ట్రంప్ ఒక పెద్ద తప్పు చేశారు” అని రాందేవ్ అన్నారు.

Also Read: పెరిగిన కృష్ణానది వరద ప్రవాహం.. వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలి: విపత్తుల నిర్వహణ సంస్థ

ఆగస్టు మొదట్లో అమెరికా ఇండియాపై 25 శాతం టారిఫ్‌లు విధించింది. తర్వాత ట్రంప్ మరో 25 శాతం టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దీనికి కారణం రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోళ్లు కొనసాగించడమే. అమెరికా టారిఫ్‌లను ఇండియా తీవ్రంగా విమర్శించింది.

ఇదే సమయంలో హౌస్‌ ఫారిన్ అఫైర్స్ కమిటీ డెమోక్రాట్లు కూడా ఇండియాపై అమెరికా టారిఫ్‌లను విమర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా ఇండియా టారిఫ్‌లు విధించి.. చైనాను, ఇతర దేశాలను ట్రంప్ వదిలేశారని వారు అన్నారు.