Heavy Rains : స్టూడెంట్స్, పేరెంట్స్‌కి అలర్ట్.. ఈ జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవులు.. తెలంగాణలో భారీ వర్షాల ఎఫెక్ట్..
Heavy rains : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రెండు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు..

Heavy rains
Heavy Rains : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. పలు ప్రాంతాల్లో వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి.
Also Read: తెలంగాణ ఆర్టీసీ మరో కొత్త ప్లాన్.. వారికి 25 శాతం డిస్కౌంట్?
వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు సమీపంలో కొనసాగిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా అదే ప్రాంతంలో కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో వాయువ్యదిశలో నెమ్మదిగా కదిలి ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ములుగు, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో రేపు (గురువారం) విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆ జిల్లాల కలెక్టర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో గురువారం అన్ని విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
గురు, శుక్రవారాల్లో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యవసరం అయితేనే జిల్లాలోని ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. ఇప్పటికే జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ అయిందని, అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నంబర్ 93919 42254 కాల్ చేయాలని కలెక్టర్ కోరారు.