తెలంగాణ ఆర్టీసీ మరో కొత్త ప్లాన్.. వారికి 25 శాతం డిస్కౌంట్?
ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రోజు సగటున 55 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వృద్ధులు 15 - 20 శాతం వరకు ఉంటున్నారు.

RTC buses
RTC buses: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 25 శాతం డిస్కౌంట్ ప్రకటించేలా తెలంగాణ ప్రభుత్వం ముందు ఆ సంస్థ ప్రతిపాదన పెట్టింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వృద్ధులకు టికెట్లలో డిస్కౌంట్ ఇస్తున్నారు.
వాటిలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక కూడా ఉన్నాయి. తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో సీనియర్ సిటిజన్‌లకు 25 శాతం డిస్కౌంట్ ఇస్తే ఆ డబ్బును సర్కారు ప్రతి నెల ఆర్టీసీకి చెల్లించాలి.
Also Read: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం
డిస్కౌంట్ ఇస్తే బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని ఆర్టీసీ భావిస్తోంది. వృద్ధులకు డిస్కౌంట్ ఇచ్చే ప్రతిపాదనను మొదట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముందు ఉంచనుంది.
అనంతరం పొన్నం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుపనుంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రోజు సగటున 55 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వృద్ధులు 15 – 20 శాతం వరకు ఉంటున్నారు.
వారికి డిస్కౌంట్ ఇస్తే వారి సంఖ్య మరింత పెరుగుతుందని ఆర్టీసీ అనుకుంటోంది. తెలంగాణలో ప్రస్తుతం మహాలక్ష్మి పథకం అమల్లో ఉంది. మహిళలకు జీరో టికెట్ ఇస్తుండడంతో నగదు లభ్యత తగ్గింది.
దీంతో ఉద్యోగులకు, డీజిల్ ఖర్చులతో పాటు బస్సుల నిర్వహణ, ఇతర అవసరాల కోసం వచ్చే ఆదాయం సరిపోవడం లేదట.