ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం

దీంతో ఆర్టీసీ ఎంప్లాయీస్‌కి ఎంతో మేలు జరుగుతుంది. 2017 వేతన సవరణ సర్క్యులర్ కింద హెచ్ఎస్ఏను పెంచినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న కృతజ్ఞతలు చెప్పారు.

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం

Telangana RTC

Updated On : August 27, 2025 / 8:17 AM IST

Telangana RTC: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు ఈ నెల జీతంతో పాటు జులై డీఏ ఇవ్వనున్నారు. ఈ మేరకు మేనేజ్‌మెంట్ పచ్చజెండా ఊపింది.

ఎంప్లాయీస్‌ హెచ్ఎస్ఏ కూడా పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే ఉన్న డీఏకు గత నెల డీఏ 2.1 శాతం కలిపి మొత్తం డీఏ 50 శాతం దాటనుంది. (Telangana RTC)

Also Read: Heavy Rains: దంచికొట్టిన వర్షం.. మూడు రోజులు ఇక ఇంతే.. ఈ జిల్లాలకు అలర్ట్‌ జారీ..

దీంతో ఆర్టీసీ ఎంప్లాయీస్‌కి ఎంతో మేలు జరుగుతుంది. 2017 వేతన సవరణ సర్క్యులర్ కింద హెచ్ఎస్ఏను పెంచినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న కృతజ్ఞతలు చెప్పారు.

తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి.