Heavy Rains: దంచికొట్టిన వర్షం.. మూడు రోజులు ఇక ఇంతే.. ఈ జిల్లాలకు అలర్ట్ జారీ..
తెలంగాణ వ్యాప్తంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

Heavy rains
తెలంగాణలో వర్షాలు మళ్లీ దంచికొట్టాయి. హైదరాబాద్‌లో గత రాత్రి నుంచి ఉదయం వరకు వర్షం పడింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైనే నీళ్లు నిలిచాయి. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
Also Read: Ganesh Chaturthi 2025: వినాయక చవితి వచ్చేసింది.. ఈ మంత్రాలు జపించండి.. ఏం జరుగుతుందంటే?
ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అన్నారు. దాని ప్రభావంతో తెలంగాణలోనూ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసిందని చెప్పారు. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఇవాళ ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌లో గరిష్ఠంగా 9.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 33.8 డిగ్రీలు నమోదుకాగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.3డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 45.6 శాతంగా ఉంది.