COVID-19 Relief : కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్‌ల వినియోగం

ఈ ఏడాది మార్చి 9న మానవరహిత విమాన వ్యవస్థ (యూఏఎస్)-2021 నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాల‌ని డీజీసీఏను కోరింది.

Drones

Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా వ్యాపిస్తూనే ఉంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో కోవిడ్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ప్రక్రియను జోరుగా కొనసాగిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ఎంతో మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసింది. అయితే..వ్యాక్సిన్ పంపిణీలో పలు సమస్యలు ఏర్పడుతుండడంతో డ్రోన్ల వినియోగం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అనుమతిని ఇవ్వాలంటూ..కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరింది. దీంతో డీజీసీఏ తెలంగాణ సర్కార్ కు అనుమతినిచ్చింది. ఏడాది అమల్లో ఉంటుందని వెల్లడించింది. వ్యాక్సిన్ల పంపిణీ కోసం ఈ ఏడాది మార్చి 9న మానవరహిత విమాన వ్యవస్థ (యూఏఎస్)-2021 నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాల‌ని డీజీసీఏను కోరింది.

చివరి మైలు వరకు ఆరోగ్య సేవలు అందించడం డ్రోన్ సేవల లక్ష్యం. డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీపై అధ్యయనానికి ఐసీఎంఆర్ కూడా అనుమతులు ఇచ్చింది.
డ్రోన్లను ఉపయోగించి వ్యాక్సిన్లను ప్రయోగాత్మకంగా పంపిణీ చేసేందుకు మానవరహిత విమాన వ్యవస్థ (యూఏఎస్)-2021 నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వానికి షరతులతో కూడిన అనుమ‌తులు ఇస్తున్న‌ట్లు కేంద్ర పౌర విమాన‌యాన మంత్రిత్వ శాఖ త‌న అధికార ట్విట్టర్లో ప్రకటించింది.