Singareni Workers : సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. దసరా బోనస్‌పై కీలక ప్రకటన

Singareni Workers : సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బోనస్ పై కీలక ప్రకటన వెలువడింది. సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో 34శాతం వాటాను కార్మికులకు బోనస్‌గా కేటాయించింది.

Singareni Workers

Singareni Workers : సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా పండుగ సందర్భంగా బోనస్ పై కీలక ప్రకటన వెలువడింది. గత ఏడాదిమాదిరిగానే సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో 34శాతం వాటాను కార్మికులకు బోనస్‌గా కేటాయించింది. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1,51,912 బోనస్‌గా అందనుంది. కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 చొప్పున బోనస్ ఇవ్వనుంది

Also Read : Hyderabad Vijayawada Highway : హైదరాబాద్ – విజయవాడ హైవే ఆరు లైన్ల విస్తరణ పనులకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే?

ప్రజాభవన్ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంయుక్తంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు, సంక్షే హామీలను ప్రకటించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ మొత్తం రూ.1,754 కోట్ల లాభాలను ఆర్జించిందని, ఇందులో 34శాతం వాటాను కార్మికులకు బోనస్ గా కేటాయించనున్నామని చెప్పారు. సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు దసరా పండుగ సందర్భంగా ఈ బోనస్ అందించనున్నట్లు పేర్కొన్నారు. సింగరేణిలో పెండింగ్ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.

సింగరేణిలో 38వేల మంది శాశ్వత కార్మికులు, 30వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న 300మంది డిపెండెంట్ కార్మికుల ఆర్డర్లను 15రోజుల్లో ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. మారుపేర్ల అంశానికి సంబంధించి 15రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు. మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ ఆసుపత్రిలోనే బోర్డు ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. మొత్తంగా దసరా బోనస్‌తో పాటు కారుణ్య నియామకాలు, పెండింగ్ ఉద్యోగాలు, హౌసింగ్ కాలనీలు, ఇతర కార్మిక సమస్యల పరిష్కారంపై సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయాలు తీసుకుంది.