తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు శుభవార్త

పదవీ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు ఇప్పటి నుంచి రూ. 2 లక్షలు

AnganWadi

తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. పదవీ విరమణ సమయంలో లభించే ప్రయోజనాలను (రిటైర్మెంట్ బెనిఫిట్స్) పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ పెంపునకు సంబంధించిన ఫైల్‌ను ఆర్థిక శాఖ ఆమోదించింది. ఫైనాన్స్ శాఖ ఫైల్‌ను క్లియర్‌ చేయడంతో సంబంధిత ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశముంది.

అందే ప్రయోజనాలు ఇవే

  • పదవీ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు ఇకపై రూ. 2 లక్షలు
  • పదవీ విరమణ చేసే అంగన్వాడీ హెల్పర్లకు రూ.లక్ష

ఈ నిర్ణయం వేలాది మంది అంగన్వాడీ సిబ్బందికి ఉపశమనం కలిగించనుంది. ప్రభుత్వంపై విశ్వాసంతో ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న వారికీ ఇది తీపి కబురే. దీనికి సంబంధించిన త్వరలో ఉత్తర్వులు విడుదల కానున్నాయి.