Telangana Assembly Meetings : ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వర్షాలు, వరదలతోపాటు పలు కీలక అంశాలపై చర్చ

కేబినెట్ లో ఆమోదించిన ప్రధాన అంశాలు అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రం భారీ వర్షాలు, వరదలు లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది.

Telangana assembly

Telangana Government : ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. సోమవారం (జులై31,2023) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగనుంది.

కేబినెట్ లో ఆమోదించిన ప్రధాన అంశాలు అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రం భారీ వర్షాలు, వరదలు లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. వర్షాలు, వరదలతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయబోతున్నారు. దీనిపై కేబినెట్ లో కూడా చర్చ జరుగనుంది. అయితే ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనేది సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత బీఏసీ నిర్ణయిస్తుంది.

High Court : తెలంగాణలో భారీ వర్షాలపై హైకోర్టులో పిల్.. వరదల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు

అయితే మినిమమ్ వారం రోజులైన అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని ప్రతిపక్షాలు, ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్నది బేఏసీ సమావేశంలో క్లారిటీ రానుంది. ఈ సమవేశాల్లో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తాజాగా రాజకీయ పరిణామాలు, రానున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. బీసీలకు చేయూత, మైనార్టీ బంధు లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలపనుంది. దీని కనుగుణంగానే ఈ అంశాలన్నీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక రాజకీయ అంశాలు కూడా సమావేశాల్లో చర్చకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.