Telangana : రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు.. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం కీలక నిర్ణయం

అప్పుడే అయిపోలేదని, మరికొన్ని రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. Telangana

Telangana Holidays(Photo : Google)

Telangana Rains : తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ సహా చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వాన దెబ్బకు జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది.

పలు జిల్లాలకు రెడ్ అలర్ట్..
వరద నీరు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అప్పుడే అయిపోలేదని, మరికొన్ని రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు(స్కూళ్లు, కాలేజీలు) సెలవులు ప్రకటించింది. రెండు రోజులు హాలిడేస్ ఇచ్చింది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.(Telangana)

ముందు జాగ్రత్తగా సెలవులు..
రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు రెండు రోజులు అంటే రేపు (జూలై 26), ఎల్లుండి (జూలై 27) హాలిడేస్ ఇచ్చింది కేసీఆర్ సర్కార్. భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. కాగా.. వర్షాల కారణంగా గత గురువారం, శుక్రవారం, శనివారం విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం, మంగళవారం మాత్రమే స్కూళ్లు, కాలేజీలు కొనసాగాయి. బుధవారం, గురువారం మరోసారి సెలవులు ఇచ్చింది ప్రభుత్వం.

Also Read..Google Android Users : ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. ఆగస్టులోగా మీ ఫోన్లను అప్‌డేట్ చేసుకోండి..

స్కూళ్లకే కాదు కాలేజీలకు కూడా సెలవులే..
విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. పాఠశాల విద్యాశాఖ మాత్రమే ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కాలేజీలకు సెలవులు ఉన్నట్టా? లేనట్టా? అనే గందరగోళం ఏర్పడింది. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విటర్ లో క్లారిటీ ఇచ్చారు. అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని, తక్షణమే సంబంధిత శాఖలు ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి సబిత తెలిపారు.(Telangana)

పరీక్షలు వాయిదా..
భారీ వర్షాల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. త్వరలోనే తదుపరి పరీక్షల తేదీలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

సెలవులు ఇవ్వొద్దు..
హైదరాబాద్ లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అలర్ట్ అయ్యారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలో పని చేసే అధికారులు, సిబ్బందికి అత్యవసరం ఉంటే తప్ప సెలవులు ఇవ్వొద్దని మేయర్ ఆదేశించారు.

Also Read..Hyderabad : భారీ వర్షాల ఎఫెక్ట్.. హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలకు పోలీసుల కీలక ఆదేశాలు, ఉద్యోగులు ఇంటికి వెళ్లేందుకు టైమింగ్స్

ట్రెండింగ్ వార్తలు