Telangana budget : బడ్జెట్‌లో విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఆ పథకాలకు భారీగా కేటాయింపులు
elangana budget : బడ్జెట్లో విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యకు 8.22 శాతం ప్రభుత్వం కేటాయింపులు చేసింది.
- Harishth Thanniru
- Published On : March 20, 2026 / 02:15 PM IST
Telangana budget
Telangana budget : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026-27ను అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం రూ.3,24,234 కోట్లుగా తెలిపారు. రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లుకాగా.. మూలధనం వ్యయం రూ.47,267కోట్లుగా పేర్కొన్నారు. అయితే, ఈ బడ్జెట్లో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.
బడ్జెట్ లో విద్యకు 8.22 శాతం ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఫ్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ స్కీం, ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం, వెల్ఫేర్ విద్యా సంస్థల్లో వంటగదుల ఆధునీకరణకు 100 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అంతేకాక.. ఉస్మానియా యూనివర్శిటీ రూ. వెయ్యి కోట్లు, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీకి రూ.400 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్ లో ట్రైనీలకు నెలకు రూ.2వేల స్కాలర్ షిప్ లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా 2026-27 ఏడాది పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 15 కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పనకు, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది.
కొన్ని కేటాయింపులు ఇలా..
♦ విద్యాశాఖకు ప్రభుత్వం రూ.26,674 కోట్లు కేటాయించింది.
♦ ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్ విద్యార్థుల దాకా బ్రేక్ ఫాస్ట్ పథకం
♦ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం
♦ 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు
♦ దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాల పంపిణీ
♦ వెల్ఫేర్ స్కూల్స్‌లో వసతుల కల్పనకు రూ.100కోట్లు
♦ 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా అప్‌గ్రేడ్
♦ 2026-27 సంవత్సరానికి పాలిటెక్నిక్ కాలేజీల్లో 15 కొత్త కోర్సులు
♦ విద్యాశాఖ పరిధిలోకి స్కిల్ యూనివర్సిటీ
♦ ITIలలో ATC ట్రైనీలకు ప్రతినెలా రూ.2వేల స్కాలర్‌షిప్
♦ విదేశాల్లో యువతకు ఉపాధి అవకాశాల కోసం కొత్తగా సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ కార్యక్రమం
