ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం కీలక సూచన

తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 21శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించింది.

Minister Ponnam Prabhakar

Minister Ponnam Prabhakar : తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 21శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో.. పేస్కేల్-2017 సర్వీసులోఉన్న 42,057 ఉద్యోగులకు, 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి పదవీ విరమణ చేసిన 11,014 మంది ఉద్యోగులకు.. మొత్తం 53,071 ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జూన్ 1 నుంచి తాజా పీఆర్సీ అమలు కానుందని తెలిపారు. ఫిట్మెంట్ 21శాతం ఇవ్వాలని నిర్ణయించామని, దీనివల్ల ఏడాదికి రూ.418.11 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. అయినా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్నామని పొన్నం అన్నారు. ఆర్టీసీ బస్సులు ఆక్యూపెన్షీ పెరిగిందని, ప్రయాణికులకు సౌకర్యాల కల్పనకూడా పెంచుతున్నామని చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వడం ఇష్టం లేకపోతే విపక్షాలు చెప్పాలని, అలాకాకుండా ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టడం సరికాదని పొన్నం సూచించారు.

Also Read : సీట్ల సర్దుబాటుపై ముగిసిన చర్చలు.. బీజేపీ, జనసేన పార్టీలు పోటీచేసే ఎంపీ స్థానాలు ఇవే!?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని మంత్రి పొన్నం అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మహాలక్ష్మి పథకం అమలుకు సిద్ధమ య్యారు.. విజయవంతం చేశారని మంత్రి వారి కృషిని కొనియాడారు. మూడు నెలల్లో 25కోట్ల మహిళలు ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమంకోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. ప్రావిడెంట్ ఫండ్ నీ గతంలో వాడుకున్నారు.. దీంతో ఉద్యోగులు బాండ్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇప్పుడు 2017 పీఆర్సీ పూర్తిస్థాయిలో ఇవ్వాలని అనుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఆర్టీసీ నష్టాల నుంచి ప్రాఫిట్ వైపుగా వెళ్తున్నామని మంత్రి చెప్పారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు