medical department
Telangana Govt Job Notification: ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ క్రమంలో ఒక్కో శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా.. వైద్య ఆరోగ్య శాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
‘మెడికల్ కాలేజీల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, ఇతర అంశాలను పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ భర్తీతో మెడికల్ కాలేజీల్లో బోధన సమస్యలు దాదాపు తీరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.’
ఎలా అప్లయ్ చేయాలి..?
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు జులై 10 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని బోర్డు అధికారులు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జులై 10 నుంచి http://mhsrb.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 17 సాయంత్రం 5గంటల వరకు. వివరాల ఎడిట్ కు జులై 18, 19 తేదీల్లో అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ప్రతి పోస్టుకు విడిగా అప్లయ్ చేయాలి. మల్టీ జోన్ -1లో 379, మల్టీ జోన్ -2లో 228 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు ఏమిటి..?
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి సంబంధిత విభాగంలో పీజీ మెడికల్ డిగ్రీ (MD/MS/DNB) కలిగి ఉండాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్/స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుండి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంటాయి.
ఎలా ఎంపిక చేస్తారు..?
అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం, పరీక్షల్లో పొందిన మార్కులు ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
జీతం ఎంత వస్తుంది..?
ఎంపికైన అభ్యర్థులకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం నెలకు రూ.68,900 నుంచి రూ.2,05,500 వరకు వేతనం ఉంటుంది. అదనంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర భత్యాలు కూడా వర్తిస్తాయి. సందేహాలు ఉంటే పూర్తి సమాచారం కోసం MHSRB అధికారిక వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.inను సందర్శించాలి.
The details of posts, vacancies and scale of pay are given below..