Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పు మాత్రం అసలు చేయొద్దు!

Indiramma Houses : ఇకపై ఇందిరమ్మ ఇళ్లను పొందడం అంత ఈజీ కాదు. జియో పెన్సింగ్‌ విధానంతో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. అలాంటి ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే నిధులు అందనున్నాయి.

Indiramma Houses

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల బద్దిదారులకు బిగ్ అలర్ట్.. సర్వే సమయంలో సూచించిన స్థలంలోనే ఇళ్లను నిర్మించుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. సర్వే సందర్భంగా చూపించిన స్థలాలకు బదులుగా మరో చోట ఇల్లు నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నిస్తే ఆయా ఇళ్లను రద్దు చేస్తామని హెచ్చరించింది.

Read Also : Gold Deposit Scheme : బంగారంపై డబ్బులు సంపాదించే అద్భుత అవకాశం.. గోల్డ్ ఇలా డిపాజిట్ చేయండి.. వడ్డీతోనే హాయిగా బతికేయొచ్చు!

ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కచ్చితంగా ప్రతిఒక్కరూ పారదర్శకత పాటించాల్సిందిగా సూచించింది. అంతేకాదు.. జియో పెన్సింగ్‌ విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. అలాంటి ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే ప్రభుత్వం నుంచి నిధులను అందిస్తామని కేంద్రం పేర్కొంది.

అందుకు తెలంగాణప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. ఆర్టిపిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ద్వారా ప్రత్యేక యాప్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ యాప్‌ సాయంతో గతంలో సర్వే చేసిన ఇంటి స్థలంలోనే ఇల్లు నిర్మాణం చేపట్టేందుకు వీలుంటుంది. తాజా నిర్ణయంతో ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి అక్రమాలకు అవకాశం ఉండదు.

జియో పెన్సింగ్‌ విధానం ప్రకారమే :
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద మొదటి విడతగా వేలాది ఇళ్లను మంజూరు చేసింది. అందులో ఒక్కో నియోజకవర్గానికి 3వేల 5వందల చొప్పున ఉమ్మడి జిల్లాకు 42 వేల ఇళ్లను మంజూరు చేసింది. దీనికి సంబంధించి దరఖాస్తులను కూడా స్వీకరించింది. ఆపై ఇంటింటి సర్వేను కూడా పూర్తి చేసింది.

సర్వే సమయంలో ఇల్లు, ఇంటి స్థలం, డాక్యుమెంట్ల వివరాలను అధికారులు అప్‌లోడ్‌ చేశారు. సొంత స్థలం కలిగినే పేదల జాబితాను కూడా రెడీ చేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారంతా సర్వేలో చూపించిన చోటనే కొత్త ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది.

తప్పుడు సమాచారం ఇస్తే అంతే :
జియో పెన్సింగ్‌ విధానం ద్వారా అనుమతి పొందినవారు తప్పనిసరిగా అదే స్థలంలో ముగ్గులను పోయాలి. ఆ ముగ్గు వేసే సమయంలో ఇంటి యజమానితో పాటు గ్రామ కార్యదర్శి, వార్డు అధికారి కూడా ఉంటారు. సర్వే సందర్భంగా నమోదు చేసిన స్థలం వివరాలను అప్పుడే వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జియో పెన్సింగ్ విధానం ద్వారా స్పెషల్ యాప్‌లో ఆయా స్థలం వివరాలు, అక్షాంశ, రేఖాంశాలతో గుర్తిస్తారు.

వెరిఫికేషన్ కోసం వచ్చిన సమయంలో అదే స్థలాన్ని నమోదు చేసిన యాప్ ద్వారా నిశితంగా పరిశీలిస్తారు. సర్వే వివరాలు సరిపోలితేనే ఆయా లబ్ధిదారుల ఫొటోలు, వ్యక్తిగత వివరాలన్నీ అన్‌లైడ్‌లో అప్‌లోడ్‌ అవుతాయని గమనించాలి. ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తేలితే ఆ యాప్‌ ఆయా వివరాలను అనుమతించదు.

Read Also : Maha Shivratri 2025 : మహాశివరాత్రి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. ఏరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టే!

ఇకపై ఇలాంటివి కుదరదు :
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబోయే జియో పెన్సింగ్‌ విధానంతో అక్రమాటలకు అడ్డకట్ట పడనుంది. పాత ఇళ్లను చూపించి మరో చోట కొత్త ఇళ్లను కట్టే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు అయితే ఒకరి పేరు మీద ఇళ్లు మంజూరు అయితే వారి పేరుతో మరొకరు ఇళ్ల నిర్మాణం చేయడం, దరఖాస్తుకు ముందు ఇళ్ల చోట ఒక దగ్గర చూపించి మరో చోట ఇళ్లను నిర్మించుకోవడం వంటివి ఎక్కువగా జరిగేవి. రాబోయే ఈ కొత్త జియో పెన్సింగ్ విధానం ద్వారా అలాంటి అక్రమాలకు అడ్డకట్ట వేసినట్టే అవుతుంది.