Telangana Govt
Telangana Government : తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. ఆయా విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. శుక్రవారం రెండు విభాగాల్లో నోటిఫికేషన్లు విడుదల చేయడం ద్వారా 6,569 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. గ్రూప్-3లో 1,365 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ మధ్యలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ లో పేర్కొంది. వైద్య విధాన పరిషత్ లో 752, ఎంఎస్ జే సంస్థల్లో 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 127, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ విభాగంలో ఎనిమిది, మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ విద్యా సంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు. అయితే, ఈ పోస్టులకు దరఖాస్తులను జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15వరకు ఆన్‌లైన్‍లో స్వీకరించడం జరుగుతుందని తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసు రిక్రూట్ మెంట్ బోర్డు వెల్లడించింది.
Notification has been released for the recruitment of 5,204 staff nurse posts
గ్రూప్-3 విభాగంలో 1,365 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో అత్యధికంగా ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ విభాగంలో 712 పోస్టులు భర్తీ చేయనున్నారు.
Group-111 Services (Gneral Recruitment)