Cinema Ticket Prices: సినిమా ప్రేక్షకులకు షాక్.. పెరిగిన సినిమా టికెట్ ధరలు.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం!
తెలుగు సినీ రంగానికి ఎంతో కీలకమైన అంశమైన సినిమా టికెట్ల ధరలపై(Cinema Ticket Prices) తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- V Santhosh Kumar
- Published on- August 19, 2026 / 05:08 PM IST
Telangana government takes key decision on movie ticket prices
- సినిమా టికెట్ ధరల సవరణ
- థియేటర్ల నిర్వహణపై కొత్త నిర్ణయం
- వర్గీకరణ ప్రకారం మారిన రేట్లు
Cinema Ticket Prices: తెలుగు సినీ రంగానికి, థియేటర్ యాజమాన్యాలకు, ప్రేక్షకులకు ఎంతో కీలకమైన అంశమైన సినిమా టికెట్ల ధరలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో థియేటర్ల నిర్వహణను మరింత పారదర్శకం చేయడంతో పాటు, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సామాన్య ప్రేక్షకుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని నూతన మార్గదర్శకాలను ఖరారు చేసింది. సింగిల్ స్క్రీన్ల నుంచి మల్టీప్లెక్స్ ల వరకు ప్రదర్శన వేదికల వర్గీకరణ ఆధారంగా కనిష్ఠ, గరిష్ఠ టికెట్ ధరల పరిమితులను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఈ సంచలన ఉత్తర్వులను జారీ చేసింది.
సింగిల్ స్క్రీన్లు, స్పెషల్ థియేటర్ల ధరల వివరాలు:
ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర (Cinema Ticket Prices)కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70 కాగా, ప్రీమియం విభాగంలో కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.100గా నిర్ణయించారు. సాధారణ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం ధరలు రూ.50 నుంచి రూ.150 వరకు, ప్రీమియం కేటగిరీ ధరలు రూ.100 నుంచి రూ.200 మధ్య ఉండనున్నాయి. ఇక సాంకేతికంగా అధునాతన సదుపాయాలు ఉండే స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం సీట్ల ధరను కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250 వరకు ఖరారు చేస్తూ నిర్దిష్టమైన ప్రణాళికను అమల్లోకి తెచ్చారు.
మల్టీప్లెక్స్ వర్గీకరణ, అమల్లోకి నూతన రేట్లు:
ఆధునిక మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా వీక్షణ అనుభవాన్ని బట్టి రుసుములను నిర్ణయించారు. మల్టీప్లెక్స్ లలో కనిష్ఠ టికెట్ ధర రూ.200 కాగా, గరిష్ఠ ధరను రూ.300గా ప్రవేశపెట్టారు. ఈ నూతన ధరల వర్గీకరణ ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులకు అందుబాటులో వినోదాన్ని అందిస్తూనే, థియేటర్ల సమర్థవంతమైన నిర్వహణకు సహాయపడేలా నిబంధనలను రూపకల్పన చేశారు. ఈ ధరల సవరణ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినీ థియేటర్లకు కొత్త ఉత్తేజం లభించనుండగా, రేట్ల నియంత్రణపై స్పష్టత వచ్చింది.
