×
Ad

Telangana Govt : ‘రైతు భరోసా’కు కొత్త రూల్స్.. ఈసారి వారికి మాత్రమే డబ్బులు..! తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

Telangana Govt : రైతు భరోసా పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రెండో విడత నిధులు కేవలం కొంతమంది రైతులకు మాత్రమే అందనున్నాయి.

Telangana Govt

Telangana Govt : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో కొత్త పథకాలను అమలు చేయడంతోపాటు పంటల సాగులో వారికి సహకారం అందిస్తుంది. అంతేకాక.. ఏడాదికి రెండు విడుతలు రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం నిధులు జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా రైతు భరోసా పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రెండో విడత నిధులు కేవలం కొంతమంది రైతులకు మాత్రమే అందనున్నాయి.

Also Read : CM Revanth Reddy : నూతన సర్పంచ్‌లకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్.. ఇక పండుగే..

ప్రతీయేటా ఎకరానికి రూ.12వేలను రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రెండు విడతలుగా జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో విడతల వారిగా అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది. ముందుగా ఒక ఎకరా ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన అధికారులు.. ఆ తరువాత రెండు, మూడు, నాలుగు విడుతల్లో మిగిలిన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అయితే, రబీకి సంబంధించిన రైతు భరోసా నిధులు జనవరి, ఫిబ్రవరిలో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అయితే, ఈసారి పథకం అమలులో కీలక మార్పులు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో సాగవుతున్న పంట భూములను ఉపగ్రహ చిత్రాల (శాటిలైట్ మ్యాపింగ్) ద్వారా గుర్తించి రైతు భరోసా పథకంను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉపగ్రహ చిత్రాల క్రోడీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆ నివేదిక వచ్చిన తరువాతనే రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.

రైతు భరోసా పథకం అమలు, మార్గ దర్శకాలపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఇదివరకు సాగుకు అనుకూలంగా లేని భూములకు కూడా డబ్బు ఇచ్చామన్న సీఎం.. ఈసారి మాత్రం సాగుచేసే భూములకే మనీ ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న విధానం ప్రకారం.. యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ అయ్యే అవకాశం ఉంది.