Notification For VC Posts
Notification For VC Posts : తెలంగాణలోని 10 యూనివర్సిటీల్లో వీసీల(వైస్ ఛాన్స్‌లర్ల) నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది ఉన్నత విద్యా మండలి. ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీల వీసీల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Also Read : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. కులగణనకు ఆదేశం
ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 5గంటలలోపు వీసీ పోస్టు కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. అప్లికేషన్ తో పాటు అవసరమైన అన్ని పత్రాలను జత చేసి రిజిస్ట్రర్ పోస్టు చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.tsche.ac.in. ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్సలర్ల టెర్మ్ 2024 మే వరకు ఉంది. దీంతో కొత్త వీసీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం.
* తెలంగాణ వర్సిటీల్లో వీసీల నియామకానికి నోటిఫికేషన్
* 10 వర్సిటీల్లో వీసీల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
* ఫిబ్రవరి 12లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచన
* దరఖాస్తుతో పాటు డాక్యుమెంట్లు జత చేయాలని సూచన
* నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి