×
Ad

Telangana Govt : మహిళలకు శుభవార్త.. మరో కొత్త పథకంకు తెలంగాణ సర్కార్ కసత్తు.. పది రోజుల్లో మార్గదర్శకాలు..

రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు కేటాయించడంతోపాటు..

Self Help Groups

Telangana govt Self Help Groups : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

Also Read: Gold and silver prices : బంగారం, వెండి కొంటున్నారా..? ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే

రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు కేటాయించడంతోపాటు.. మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే, తాజాగా.. పాడి రంగంలోనూ వారిని భాగస్వామ్యులను చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు విజయ డెయిరీ పార్లర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ పథకం ఒక కీలక మైలురాయిగా నిలవనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం.. ప్రతి మండలానికి ఒక విజయ డెయిరీ పార్లర్‌ను సంఘానికి కేటాయించనున్నారు. మున్సిపాలిటీల్లో రెండు పార్లర్లు చొప్పున మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. మరో పదిరోజుల్లో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

పార్లర్ ఏర్పాటుకు సుమారు రూ.5లక్షల ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, పార్లర్ కేటాయించిన సంఘానికి ఇందిరా మహిళా శక్తి ద్వారా రుణం అందించనున్నారు. సమాఖ్య వాటా కింద లక్ష రూపాయలు చెల్లిస్తే.. బ్యాంకుల ద్వారా రూ. 2లక్షల నుంచి రూ.4లక్షల వరకు రుణాన్నిఅందిస్తారు.

విజయ డెయిరీ పార్లర్ ఏర్పాటుకు ఆసక్తి చూపే స్వయం సహాయక సంఘం పాడి పరిశ్రమ అభివృద్ధి ససహకార సమాఖ్యకు రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. డెయిరీ పార్లర్ ఏర్పాటు చేసుకునే స్థలాన్ని మహిళలే పరిశీలించి నిర్ణయించుకోవాలి. ఆ తరువాత రూ.5వేలు చెల్లిస్తే అధికారికంగా పార్లర్ మంజూరు చేస్తారు.

విక్రయాల ద్వారా వచ్చే లాభం పూర్తిగా మహిళా సంఘాలకే దక్కనుంది. ఇది వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడంతోపాటు సంఘాలను మరింత బలోపేతం చేయడంలో కీలకంగా నిలవనుంది. అయితే, ఈ పార్లర్లలో కేవలం విజయ డెయిరీకు చెంది ఉత్పత్తులు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. పాలు, పెరుగు, పన్నీర్, మజ్జిగ.. అలాగే తాగునీటి బాటిళ్లు వంటి ఉత్పత్తులను విజయ డెయిరీ సంస్థే సరఫరా చేస్తుంది.