తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ ప్లాట్లు, ఖాళీ స్థలాల వేలానికి నోటిఫికేషన్.. ప్లాట్లు, ధర వివరాలు ఇలా..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రాజీవ్ స్వగృహ పరిధిలో టవర్లు, అపార్ట్‌మెంట్ ప్లాట్లు, హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములు, ఓపెన్ ప్లాట్ల వేలానికి ..

Rajiv Swagruha plots

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రాజీవ్ స్వగృహ పరిధిలో టవర్లు, అపార్ట్‌మెంట్ ప్లాట్లు, హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములు, ఓపెన్ ప్లాట్ల వేలానికి ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Also Raed: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్… ప్రతి సోమవారం అకౌంట్‌లో డబ్బులు..

రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయిన, పాక్షికంగా పూర్తయిన అపార్ట్‌మెంట్ ప్లాట్లతో పాటు ఖాళీ స్థలాలను బహిరంగ వేలంలో ప్రభుత్వం విక్రయించనుంది. ఎలాంటి వివాదాలు లేని భూములు, అందుబాటులో ఉండే ధరలతో నిర్మించిన అపార్ట్‌మెంట్ల ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్నవారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గృహనిర్మాణ శాఖ అధికారులు తెలిపారు.

 

వేలంలో ప్లాట్లు ఇవే..
♦ రాజీవ్ స్వగృహ‌కు సంబంధించినంత వరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం, గాజులరామారం ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ టవర్లు వేలంలో విక్రయించనున్నారు.
♦ పోచారంలో రెండు టవర్లు ఉండగా ఒక టవర్‌లో 122 ప్లాట్లకు (ఒక్క ఎస్ఎఫ్ టీ రూ.1,650 చొప్పున రూ.30కోట్లు, రూ.2కోట్లు డిపాజిట్), మరో టవర్ లో 72 ప్లాట్లకు (ఒక్క ఎస్ఎఫ్ టీ రూ.1,650 చొప్పున రూ.13.78 కోట్లు రూ.1 కోటి డిపాజిట్) రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ ధరలు ఖరారు చేసింది.
♦ గాజుల రామారంలో రెండు టవర్లలో ఒక్కో దాంట్లో 112 చొప్పున 224 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిని గుత్తగా అమ్ముతామని నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఒక్క టవర్ లో ఒక్క ఎస్ఎఫ్టీ రూ.1.995 చొప్పున రూ.26.33 కోట్లుగా ధరలు ఖరారు చేశారు. వీటికి ఒక్కో టవర్‌కు రూ.2 కోట్లు డిపాజిట్ గా చెల్లించాల్సి ఉంటుంది. వచ్చేనెల (ఆగస్టు) 19వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు డిపాజిట్ చెల్లించాలని, 20వ తేదీ ఉదయం 11.30గంటలకు లాటరీ తీస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
♦ బండ్లగూడలోని సహభావన టౌన్ షిప్ లో జూలై 30న, పోచారంలోని సద్భావన టౌన్ షిప్ లోని 2బీహెచ్‌కే ప్లాట్ల కోసం ఆగస్టు 1వ తేదీన, ఇతర క్యాటగిరీలకు ఆగస్టు 2వ తేదీన లాటరీ నిర్వహించనున్నారు.
♦ సహభావన ఫ్లాట్లకు ఈ నెల 29, సద్భావన ఫ్లాట్లకు ఈ నెల 31వ తేదీసాయంత్రం 5 గంటల్లోపు ధరావతు చెల్లించాలి.
♦ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (కేపీహెచ్బీ) 4వ ఫేజ్లో ఖాళీగా ఉన్న రెండు ఓపెన్ ప్లాట్లును (4,598 గజాలు, 2,420 గజాలు) ఈ వేలంలో విక్రయించనున్నారు.
♦ నాంపల్లిలోని 1,148 గజాల ఖాళీ స్థలాన్ని బహిరంగ వేలంలో అమ్మేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నెల 30న వీటిని వేలం వేయనున్నారు.