Rythu Bharosa : ‘రైతు భరోసా’లో కొత్త ట్విస్ట్.. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇకనుంచి వారికి మాత్రమే నిధులు..

Rythu Bharosa : రైతు భరోసా పథకం అమల్లో కీలక మార్పులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఖరీఫ్, రబీ సీజన్లకు కాకుండా.. ఒకే దఫా అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Telangana government Rythu Bharosa Scheme

  • రైతు భరోసా పథకంపై బిగ్ అప్డేట్
  • కేవలం ఖరీఫ్‌కే.. యాసంగికి నో?
  • శాటిలైట్ సర్వే ఆధారంగా పెట్టుబడి సాయం

Rythu Bharosa : తెలంగాణలో వానాకాలం సాగు పనులు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా పథకం నిధులకోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 30వ తేదీన మధిర నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో రైతు భరోసా పథకం నిధులను అర్హులైన రైతుల ఖాతాల్లో సీఎం రేవంత్ రెడ్డి జమ చేయనున్నారు. అయితే, రైతు భరోసా నిధులు ఒకే దఫా విడుదలవుతాయా.. విడతల వారిగా విడుదల చేస్తారా? ఎన్ని ఎకరాల వరకు పథకాన్ని అమలు చేస్తారనే అంశంపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో రైతు భరోసా పథకంలో కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.

Also Read : Telangana Rain Alert : తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. మూడ్రోజులు వానలేవానలు..

రైతు భరోసా నిధుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు అండగా నివాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో దాదాపు రూ.9వేల కోట్ల నిధులను సమీకరించినట్లు తెలుస్తోంది. గతంలో విధంగా ఈసారి దశలవారీగా కాకుండా ఒకేసారి నిధులను విడుదల చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అలావీలుకాని పక్షంలో విడతల వారిగా తొమ్మిది రోజుల్లో అర్హులైన రైతులందరికీ పథకం నిధులు జమ చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కొత్త పట్టదార్ పాసు పుస్తకాలు పొందిన వారితో కలుపుకొని సుమారు 73లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సమాచారం.

గత యాసంగి సీజన్లో కేవలం రెండు ఎకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయం అందించడంతో రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పథకంలో కొన్ని మార్పులు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెద్ద రైతుల కంటే చిన్న, సన్న కారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏడున్నర ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే సాయం అందించే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇకపై కేవలం పట్టాదారు పాస్‌బుక్ ఉండటమే కాకుండా, వాస్తవంగా పంట సాగు చేస్తున్న రైతులకే రైతు భరోసా అందించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పథకం అమలులో శాటిలైట్ సర్వే కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు వివరాలను శాటిలైట్ చిత్రాల ద్వారా సేకరించిన ప్రభుత్వం, గ్రామాల వారీగా పంట విస్తీర్ణాన్ని గుర్తించింది. పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించిన సర్వేలో కూడా మంచి ఫలితాలు రావడంతో భవిష్యత్తులో ఇదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందించే అంశంపైనా ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగినట్లు సమాచారం. కౌలు రైతులకు కూడా భరోసా కల్పించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని.. ఖరీఫ్, యాసంగి సీజన్ల వారిగా కాకుండా.. ఒకే దఫాలో ఏడున్నర ఎకరాల మేరకు సాగుభూమి కలిగి.. పంటలు సాగు చేస్తున్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు విడుదల చేసేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా ప్రస్తుతం రైతుల నుంచి ఎదురవుతున్న విమర్శలకు చెక్ పెట్టడంతోపాటు.. రానున్నకాలంలో రైతుల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత పెంచేలా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుందని తెలుస్తోంది.