×
Ad

Pranam Project: వృద్ధుల కోసం డే కేర్‌ సెంటర్లు.. ఎలా పనిచేస్తాయంటే?

అన్ని జిల్లాల్లోనూ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ మొత్తం 18 డే కేర్ సెంటర్లను రేవంత్‌ రెడ్డి ప్రారంభిస్తారు.

Senior Citizens (Image Credit To Original Source)

  • వృద్ధులను చూసుకునేందుకు సెంటర్లు
  • 37 మల్టీసర్వీస్ డేకేర్ సెంటర్ల ఏర్పాటు 
  • ‘ప్రణామ్’ పేరిట డే కేర్‌ కేంద్రాలు

Pranam Project: వృద్ధుల కోసం తెలంగాణ సర్కారు డే కేర్‌ సెంటర్లను ప్రారంభిస్తోంది. వృద్ధులను చూసుకునేందుకు, ఒంటరితనాన్ని దూరం చేసేందుకు 37 మల్టీసర్వీస్ డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా ‘ప్రణామ్’ పేరిట ఈ కేంద్రాల్లో సేవలు కొనసాగుతాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌ ప్రజా భవన్ నుంచి వర్చువల్‌గా వీటి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

Also Read: వారెవ్వా.. విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డు.. సచిన్ రికార్డును మించిపోయి..  

ఈ డే కేర్‌ సెంటర్లు హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హనుమకొండ జిల్లాల్లో రెండేసి చొప్పున ఉంటాయి. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో ఒక్కో డే కేర్ సెంటర్ చొప్పున ఏర్పాటు చేస్తున్నారు.

ఒంటరిగా ఉంటున్న వృద్ధుల కోసం ఈ డే కేర్‌ సెంటర్లు పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు. వృద్ధులు సామాజికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయని అన్నారు. వృద్ధుల జీవన నాణ్యతను మెరుగుపర్చడమే లక్ష్యంగా వీటిని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లా ఆసుపత్రుల్లోని జెరియాట్రిక్ క్లినిక్‌లతో ఈ డే కేర్‌ కేంద్రాలకు లింక్ చేస్తారు. వీటి ద్వారా ఆరోగ్య పరీక్షలు సైతం చేయిస్తారు. వారి కోసం వైద్యులు, ఫిజియోథెరపీ సేవలను కూడా అందుబాటులో ఉంచుతారు.

భారత్‌లో సర్కారు ఇటువంటి డే కేర్ సెంటర్లను నడపడం ఇదే మొదటిసారి. ఇవాళ మొత్తం 18 డే కేర్ సెంటర్లను రేవంత్‌ రెడ్డి ప్రారంభిస్తారు. ఆదివారంతో పాటు ప్రభుత్వ సెలవులు మినహా ఇతర అన్ని రోజుల్లో ఉదయం 9-సాయంత్రం 6 గంటల మధ్య ఈ డే కేర్ సెంటర్లు నడుస్తాయి. వీటిలో టీవీ, ఇంటర్నెట్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి.