Group-2 Exam Postponement
TS Govt Postponed Group 2 Exam : గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 29, 30వ తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ కు వాయిదా వేసింది. ఈ పరీక్ష రీ షెడ్యూల్ గురించి టీఎస్పీఎస్సీతో సీఎం కేసీఆర్ చర్చించారు. టీఎస్పీఎస్సీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లక్షలాది మంది ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీఎం కేసీఆర్ అన్నారు.
భవిష్యత్ లో విడుదల చేసే నోటిఫికేషన్ల విషయంలో కూడా అభ్యర్థులకు ఎటాంటి ఇబ్బంది లేకుండా చూడాలని టీఎస్పీఎస్సీకి సూచించారు. ఇక గ్రూప్ 2 పరీక్షను మూడు నెలలపాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు ఇటీవల టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించడంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ కార్యదర్శితో చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
TSPSC: టీఎస్పీఎస్సీ కేసు నుంచి తప్పించుకోవడానికి వీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసా?
అంతకముందు గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గ్రూప్ 2 పరీక్ష రీ షెడ్యూల్ గురించి సీఎస్ శాంతి కుమారితో సీఎం కేసీఆర్ చర్చించారని, టీఎస్పీఎస్సీతో చర్చించాలని సూచించారని తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీఎం అన్నారని చెప్పారు. అభ్యర్థులు పరీక్షకు సన్నదమయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని సీఎం చెప్పినట్లుగా మంత్రి కేటీఆర్ ట్విటర్ లో పేర్కొన్నారు.