Telugu » Telangana » Telangana Government Released A 42pages White Paper In Assembly
అసెంబ్లీలో 42 పేజీల శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం.. తెలంగాణ అప్పులు ఎన్నంటే?
గత ప్రభుత్వం రాష్ట్రంలోని వనరులను సక్రమంగా ఉపయోగించలేదని, రోజువారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. మొత్తం 42 పేజీల శ్వేతపత్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో విడుదల చేశారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని, కానీ, గత ప్రభుత్వం రాష్ట్రంలోని వనరులను సక్రమంగా ఉపయోగించలేదని తెలిపారు. రోజువారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని, ఇలాంటి పరిస్థితి రావడాన్ని దురదృష్టంగా భావిస్తున్నానని భట్టి అన్నారు. పదేళ్ల కాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలని, అందుకే శ్వేతపత్రం ద్వారా వివరాలను వెల్లడించడం జరిగిందని తెలిపారు.