Cheyutha Pensions: తెలంగాణలో ‘చేయూత’ పింఛన్ల పండుగ.. 4.5 లక్షల మందికి పత్రాలు.. ఈ నెల 19నే ఖాతాల్లోకి నగదు!

తెలంగాణ వ్యాప్తంగా 4.5 లక్షల మంది నూతన లబ్ధిదారులకు ‘చేయూత(Cheyutha Pensions)’ పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ గురువారం ఘనంగా ప్రారంభం అయ్యింది.

Telangana government starts cheyutha new pension sanction letters distribution for 4 5 lakh beneficiaries

Cheyutha Pensions: రాష్ట్రంలోని నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన ‘చేయూత(Cheyutha Pensions)’ పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఒకేసారి 4.5 లక్షల మంది అర్హులకు కొత్తగా పింఛన్లను మంజూరు చేయగా, ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. నియోజకవర్గ, మండల, మున్సిపాలిటీ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరై లబ్ధిదారులకు స్వయంగా పత్రాలను అందజేస్తున్నారు.

Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్యకి అరుదైన గౌరవం.. బౌలీ ఆర్ట్ సంఘం చైర్‌పర్సన్‌గా అల్లు స్నేహా రెడ్డి

మహిళలకు పెద్దపీట.. అభ్యంతరాల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్లు:

ఏళ్లుగా పింఛన్ కోసం నిరీక్షిస్తున్న అభాగ్యుల చేతికి మంజూరు పత్రాలు అందడంతో వారి కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ కొత్త పింఛన్లలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు సెర్ప్ (SERP) అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడమే కాకుండా, సాంకేతిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.

19న ఖాతాల్లోకి నగదు జమ.. 5.73 లక్షలు దాటిన కొత్త లబ్ధిదారులు:

మంజూరు పత్రాల పంపిణీ ముగిసిన వెంటనే, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ఇచ్చిన 1,23,625 పింఛన్లకు తోడు తాజాగా మంజూరు చేసిన 4.5 లక్షల పింఛన్లతో కలిపి మొత్తం కొత్త లబ్ధిదారుల సంఖ్య 5,73,625కు చేరుకుంది.